సూర్యాపేట జిల్లా:మాదక ద్రవ్యాల నిర్మూలనకు, నేరస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టడం కోసం ఏర్పాటు చేసిన సరికొత్త సాంకేతికతపై ఇంటలిజెన్స్ అధికారులు ఈరోజు రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎస్పీ రాజేంద్రప్రసాద్ ,అదనపు ఎస్పీ రీతిరాజ్ జిల్లా పోలీసు కార్యాలయం నుండి హాజరైనారు.
డ్రగ్స్ రవాణా అమ్మకాలు చేసే నేరస్తులతో పోలీస్ డేటా బేస్ తయారు చేసి అక్రమార్కులపై ప్రత్యేక దృష్టి పెట్టి గంజాయి,డ్రగ్స్, కొకైన్,నార్కోటిక్స్ లాంటి మాదకద్రవ్యాల నివారించడం కోసం పోలీసు శాఖ కట్టుబడి పని చేస్తుందని ఎస్పీ తెలిపినారు.మాదకద్రవ్యాల నివారణ,నేరస్తుల గుర్తింపుపై జిల్లా పోలీసు చేస్తున్న పనిని ఎస్పీ ఈ సందర్భంగా వివరించారు.