సూర్యాపేట జిల్లా:మీసేవ కేంద్రాల వద్ద భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణలోకి తీసుకొని వెల్ఫేర్ బోర్డు అధికారులు సమస్యలను పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం( Building Trades Union ) సిఐటియు అనుబంధం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ ( Yalka Somaiya Goud )కోరారు.సోమవారం కార్మికుల సమస్యల పరిష్కారానికై అదనపు కలెక్టర్ హేమంత్ పటేల్ కు అలాగే అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కే మంజుల, ఏఎల్వో రాజుకు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ రంగంలో పనిచేస్తున్న 54 రకాల వృత్తుల కార్మికులు ఉన్నారని,వీరిలో తాపీ మేస్త్రీలు,కూలీలకు, పెయింటింగ్,సిమెంట్ బ్రిక్స్ తయారీ,ఇటుక తయారీ కార్మికుల చేతి వేళ్ళు ఎక్కువగా అరిగిపోవడంతో మీసేవ కేంద్రాల్లో నూతన బయోమెట్రిక్ (వేలిముద్ర నమోదు) విధానాన్ని ప్రవేశపెట్టడంతో తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిలో నూతనంగా పేరు నమోదు చేసుకోవడానికి లేదా రెన్యువల్ చేసే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.వారికి బయోమెట్రిక్ సిస్టంతో పాటు కంటి పరిశీలనతో రెన్యువల్ నూతన నమోదు అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
గత నెల రోజులుగా రెన్యువల్ కాక ఇబ్బంది పడుతున్నరని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెడ్.
సుజాత, జిల్లా కమిటీ సభ్యులు మాగి లింగయ్య,యల్క రమేష్ గౌడ్,జెడ్.బాల శౌరిరెడ్డి,మధుసూదన్ రెడ్డి,సోమమ్మ,నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.