సూర్యాపేట జిల్లా: ధాన్యపు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సహకరిస్తూ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవరావు అన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలోని వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నిష్పక్షపాతంగా కాంటాలు నిర్వహించాలని,
లారీల్లో పరిమితికి మించి బస్తాలు వేయొద్దని ఐకెపి నిర్వహకులను,అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ సంఘమిత్ర, ఇంచార్జ్ ఎంపిడిఓ హరిసింగ్ నాయక్,ఎపిఎం వెంకయ్య,ఏఓ అరుణ, ఆర్ఐ మన్సూర్ అలీ తదితరులు పాల్గొన్నారు.