సూర్యాపేట జిల్లా( Suryapet District ):ఫ్రీ బస్సు పథకంతో రోడ్డున పడ్డ ఆటో కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో గురువారం నేరేడుచర్ల తాహాసిల్దార్ సైదులుకి వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిన నేపథ్యంలో ఆటో నడుపుకునే కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉచిత బస్సు( Free bus ) సౌకర్యంతో ఆటో ఎక్కే వాళ్లే కరువయ్యారని, కనీసం డీజిల్ కూడా గడిచే పరిస్థితి లేక ఆటో కార్మికుల( Auto workers ) జీవన ఉపాధి తీవ్రంగా దెబ్బతిన్నదని చెప్పారు.
ప్రభుత్వం ఆటో కార్మికులకు నెలకు 20 వేల జీవన భృతి,25 లక్షల ప్రమాద భీమా,ట్రాన్స్పోర్ట్ కార్మికులకి వెల్ఫేర్ బోర్డు కార్డులు,ఇన్సూరెన్స్ ఫిట్నెస్ లు,అడ్డా సౌకర్యాలు తదితర డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని వినతిపత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ నీల రామ్మూర్తి( Neela Rammurthy ),టిడిపి నాయకులు పాల్వాయి రమేష్( Palvai Ramesh ),ఆటో కార్మికులు ఆఫీజ్,నాగుల్ మీరా,సైదా, సంజీవరెడ్డి,శ్రవణ్, శాంతయ్య,షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.