యాదాద్రి భువనగిరి జిల్లాయాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి( Yadagirigutta Lakshmi Narasimhaswamy ) దర్శనానికి వచ్చిన హయత్ నగర్ కి చెందిన సాయిదుర్గ కుమార్, దర్శన అనంతరం బయటకు వెళ్తున్న క్రమంలో తన చేతికి గల సుమారు లక్షా యాభై వేల విలువ గల రెండున్నర తులాల బంగారు బ్రాస్లెట్ జారిపడింది.
అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ మమత( Home Guard Mamata ), ఎస్పీఎఫ్ జందార్ రామకృష్ణ బ్రాస్లెట్ ను గమనించి మైకులో భక్తులను పిలిపించి,భక్తుని వివరాలు తెలుసుకొని ఆలయ డిఇఓ భాస్కర్ శర్మ,ఏఈఓ శ్రవణ్ కుమార్,డ్యూటీ ఆఫీసర్ రాజయ్య ఆధ్వర్యంలో బ్రాస్లెట్ ను అందజేశారు.
సెక్యూరిటీ సిబ్బంది నిజాయితీకి పలువురు ప్రసంశలు.