దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే దంతాల సంరక్షణ కొరకు ప్రతిరోజు రెండుసార్లు బ్రష్ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఫ్లాష్ చేయడం, సరైన మౌత్ వాష్ ఉపయోగించడం వలన డెంటల్ హెల్త్ కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అయితే కొందరు దంతాలు తెలుపుగా కనిపించాలంటే ఎక్కువ ఫోర్స్ తో బ్రష్ చేయాలనే భ్రమను కలిగి ఉంటారు.కానీ ఈ అత్యుత్సాహం వలన పెద్దగా ప్రయోజనం ఉండదు.
దీని వలన ప్రమాదాలు ముంచుకొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే దాదాపు 20% మంది అమెరికాలో దంతాలను హార్డ్ గా బ్రష్ చేయడం వలన దంతాలపై ఉండే రక్షిత పొర అనబడే ఎనామెల్ పాడైపోయిందని తెలిసింది.

అయితే ఇది సెన్సిటివ్ టీత్, గమ్ లైన్, పీరియాంటల్ సమస్యలకు దారితీస్తుందని ఓ తాజా అధ్యయనం తెలిపింది.అయితే ఇలాంటివారు వేడి, చల్లటి ఆహారలకు దూరంగా ఉండాలి.ఎందుకంటే ఇలాంటి ఆహారాలకు సెన్సిటివిటీ కలిగి ఉంటున్నారని అధ్యయనం తెలిపింది.అయితే ఒక్కసారి ఇలా అరిగిపోయిన తర్వాత అది మళ్లీ పునరుత్పత్తి చేయబడదు.దీనివలన కావిటీస్ ప్రమాదం పెరుగుతుంది.అయితే మనం ఈ బిజీ లైఫ్ కారణంగా హడావిడి పనులలో హార్డ్ గా బ్రెష్ చేయడం వలన కొన్ని ప్రమాదాలకు గురవుతాము.

ఆ ప్రమాదాల నుండి బయట పడాలంటే బ్రష్ చేసే టైంలో పళ్ళపై ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి అని గుర్తుంచుకోవాలి.ఇందుకు ఒక చిట్కా కూడా ఉంది.పండిన టొమాటో( Tomato )ను బ్రష్ చేస్తున్నట్లు ఊహించుకోని బ్రష్ చేస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.దాని ఉపరితలం పాడు కాకుండా శుభ్రం చేయడానికి ఎంత ఒత్తిడిని ఉపయోగిస్తున్నారో అంతే ఒత్తిడిని పళ్ళపై వర్తింపజేయాలని చెబుతున్నారు.
ఈ విషయంలో ఎలక్ట్రిక్ బ్రష్ కూడా సహాయపడుతుంది.ఇది హార్డ్ గా బ్రష్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ముందుగానే హెచ్చరిస్తుంది.కాబట్టి ఎలక్ట్రిక్ బ్రష్ సహాయంతో డైలీ బ్రెష్ చేసుకుంటే పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.