సూర్యాపేట జిల్లా: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు ఎంసీపీఐయూ పోలిట్ బ్యూరో సభ్యులు భీమిరెడ్డి నర్సింహ రెడ్డి చేసిన సాయుధ పోరాట చరిత్ర మరువలేనిదని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు,రాజ్యసభ ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.మంగళవారం భీమిరెడ్డి నర్సింహారెడ్డి 15 వ వర్ధంతిని పురస్కరించుకొని,జిల్లా కేంద్రంలోనీ 60 ఫీట్ల రోడ్డు నందు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఎంసిపిఐయు సూర్యాపేట జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భీమిరెడ్డి నరసింహారెడ్డి భూమి,భుక్తి, పేద ప్రజల విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.వేలాది ఎకరాల భూములను పేద ప్రజలకు పంచిన చరిత్ర ఆయనకే దక్కిందన్నారు.
ప్రజాక్షేత్రంలో మూడు సార్లు ఎంపీగా,రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజా సమస్యలపై చట్టసభల్లో గొంతెత్తిన ధీశాలి అని గుర్తు చేశారు.ఆనాడు చాకలి ఐలమ్మకు అండగా నిలిచి ఆమెను తెలంగాణ సాయుధ పోరాటానికి సన్నద్ధం చేసిన నాయకుడని చెప్పుకొచ్చారు.
నేటి తరం యువత భీమిరెడ్డి నర్సింహారెడ్డిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో రాణించాలని సూచించారు.నాటి నల్లగొండ జిల్లా కరివిరాల కొత్తగూడెంలో పుట్టిన కమ్యూనిస్టు యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి ప్రపంచ చరిత్రలో నిలిచిపోయారని గుర్తు చేశారు.
ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న మాట్లాడుతూ శ్రీరాంసాగర్ రెండవ దశకు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు నామకరణం చేయాలని,హైదరాబాదులోని ట్యాంక్ బండిమీద భీమిరెడ్డి విగ్రహాన్ని నెలకొల్పాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వై.
వెంకటేశ్వర్లు(వైవి), హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మందుల శామ్యూల్,
రైతు బంధు రాష్ట్ర కమిటీ సభ్యులు గుడిపూడి వెంకటేశ్వరావు, ఎంసిపిఐయు జిల్లా నాయకులు మోరపాక ఉగ్రయ్య,లింగంపల్లి రాజు, ఓంకార్,బుల్లె ఎల్లమ్మ, ఏపూరి సోమన్న,మీసాల సైదులు,అడ్వకేట్స్ మల్లు వెంకట్రాంరెడ్డి, నా శ్రవణ్ కుమార్,మాజీ కౌన్సిలర్ సారగండ్ల మాణిక్యమ్మ,బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొమ్మిడి లక్ష్మి నారాయణ,కిషన్,అంగోత్ భావ సింగ్,వడ్డెర సంఘం నాయకులు శివరాత్రి రాములు,కుంచం యాదగిరి,పార్టీ కార్యకర్తలు,నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు.