రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన భుజంగాల రాజేష్ దళిత బంధు పథకంలో భాగంగా ఏర్పాటు చేసుకున్న మెడికల్ షాప్ ను బుధవారం బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య చేతుల మీదుగా ప్రారంభించుకున్నారు.అనంతరం ఆగయ్య మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో అమలు కానీ దళిత బంధు పథకం మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంతో ఉపాధి పొందాలని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రంగంపేట సర్పంచ్ నందగిరి లింగం , జెడ్పిటిసి కళావతి సురేష్, ఎంపీపీ భూల, మండల సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు రాజిరెడ్డి , బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.