రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావంగా సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి వారి హక్కుల కోసం పోరాటం చేస్తామని అన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల శిబిరంలో కూర్చుండి వారి కష్టాలను తెలుసుకున్నారు.తెలంగాణ వస్తే దేశాన్ని కాపాడే సిపాయిలు ఎంత ముఖ్యమో గ్రామాలను కాపాడే పారిశుద్ధ్య కార్మికులు కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నీటి మూటలు అయ్యాయన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు పే స్కేల్ వర్తింపజేయాలన్నారు.వారి ఆరోగ్యం కోసం ప్రభుత్వపరంగా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని అన్నారు.ఈ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయకుంటే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పారిశుధ్య కార్మికుల కోరికలను తప్పకుండా తీరుస్తామని ఇది వారి హక్కు అని అన్నారు.
సంఘీభావం తెలిపిన వారిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి , మండల బీసీ సెల్ అధ్యక్షులు అనవేని రవి, నాయకులు గంట బుచ్చ గౌడ్, రాజు నాయక్ ,రామ్ రెడ్డి, సంతోష్ గౌడ్ ,తిరుపతి గౌడ్, లక్ష్మీనారాయణ, ఎండి హిమాం,కోనేటి పోచయ్య, భూమ్ రెడ్డి ,మల్లయ్య, గుర్రం రాములు, చెన్ని బాబు, బిపేట రాజు తదితరులు పాల్గొన్నారు.