సినిమాలు మానేసిన నెంబర్ వన్ హీరోయిన్ గా సమంత?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha ) ప్రస్తుతం ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈమె గత కొద్ది రోజుల క్రితం మయోసైటిసిస్ వ్యాధి బారిన పడ్డారు.

 Samantha Quit Movies And Become, Samantha ,rashmika Mandanna, Ormax, Tollywood,-TeluguStop.com

అయితే ఈ వ్యాధి నుంచి కొంత కోలుకున్నప్పటికీ ఇంకా ఈ వ్యాధి పూర్తి నయం కాకపోవడంతో ఆ ప్రభావం తిరిగి సమంతపై పడుతుంది అందుకే తన ప్రాజెక్టులు పూర్తి చేసుకొని కొత్త ప్రాజెక్టులకు కమిట్ అవ్వకుండా ఏడాదిపాటు విరామం ప్రకటించి పూర్తిగా తన దృష్టిని ఆరోగ్యం పైన పెట్టారు.ఇలా ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించినటువంటి ఈమె ఆధ్యాత్మిక వైపు కూడా ప్రయాణం చేస్తూ తనని తాను ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Telugu Ormax, Samantha, Tollywood-Movie

ఇలా సమంత ఏడాది పాటు సినిమాలకు దూరమవుతారని తెలియజేయడంతో అభిమానులు కాస్త ఆందోళనకు గురైనప్పటికీ తాను తిరిగి మరింత స్ట్రాంగ్ గా తిరిగి రావాలని కోరుకున్నారు.అయితే సమంత సినిమాలకు దూరమైనప్పటికీ ఏమాత్రం తన క్రేజ్ తగ్గలేదని తెలుస్తుంది.ప్రతినెల ఓర్మాక్స్( Ormax ) మీడియా అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన సెలబ్రిటీల జాబితాలను విడుదల చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే జూన్ నెలకు సంబంధించిన జాబితాను కూడా విడుదల చేశారు.

అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన హీరోయిన్ల జాబితాలలో సమంత మొదటి స్థానంలో నిలవడం విశేషం.

Telugu Ormax, Samantha, Tollywood-Movie

ఇలా సమంత సినిమాలకు దూరమైనప్పటికీ తన క్రేజ్ మాత్రం తగ్గకుండా నెంబర్ వన్ హీరోయిన్ గా నిలవడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సౌత్ స్టార్ హీరోయిన్లను దాటుకుని సమంత ఇలా మొదటి స్థానంలో నిలవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ జాబితాలో సమంత మొదటి స్థానంలో ఉండగా రష్మిక మందన్న( Rashmika Mandanna ) పదో స్థానంలో ఉండడం గమనార్హం.

రష్మిక ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ ఈమె మాత్రం పదో స్థానంలో ఉండటంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube