సినిమాలు మానేసిన నెంబర్ వన్ హీరోయిన్ గా సమంత?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha ) ప్రస్తుతం ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈమె గత కొద్ది రోజుల క్రితం మయోసైటిసిస్ వ్యాధి బారిన పడ్డారు.అయితే ఈ వ్యాధి నుంచి కొంత కోలుకున్నప్పటికీ ఇంకా ఈ వ్యాధి పూర్తి నయం కాకపోవడంతో ఆ ప్రభావం తిరిగి సమంతపై పడుతుంది అందుకే తన ప్రాజెక్టులు పూర్తి చేసుకొని కొత్త ప్రాజెక్టులకు కమిట్ అవ్వకుండా ఏడాదిపాటు విరామం ప్రకటించి పూర్తిగా తన దృష్టిని ఆరోగ్యం పైన పెట్టారు.

ఇలా ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించినటువంటి ఈమె ఆధ్యాత్మిక వైపు కూడా ప్రయాణం చేస్తూ తనని తాను ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

"""/" / ఇలా సమంత ఏడాది పాటు సినిమాలకు దూరమవుతారని తెలియజేయడంతో అభిమానులు కాస్త ఆందోళనకు గురైనప్పటికీ తాను తిరిగి మరింత స్ట్రాంగ్ గా తిరిగి రావాలని కోరుకున్నారు.

అయితే సమంత సినిమాలకు దూరమైనప్పటికీ ఏమాత్రం తన క్రేజ్ తగ్గలేదని తెలుస్తుంది.ప్రతినెల ఓర్మాక్స్( Ormax ) మీడియా అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన సెలబ్రిటీల జాబితాలను విడుదల చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే జూన్ నెలకు సంబంధించిన జాబితాను కూడా విడుదల చేశారు.అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన హీరోయిన్ల జాబితాలలో సమంత మొదటి స్థానంలో నిలవడం విశేషం.

"""/" / ఇలా సమంత సినిమాలకు దూరమైనప్పటికీ తన క్రేజ్ మాత్రం తగ్గకుండా నెంబర్ వన్ హీరోయిన్ గా నిలవడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సౌత్ స్టార్ హీరోయిన్లను దాటుకుని సమంత ఇలా మొదటి స్థానంలో నిలవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ జాబితాలో సమంత మొదటి స్థానంలో ఉండగా రష్మిక మందన్న( Rashmika Mandanna ) పదో స్థానంలో ఉండడం గమనార్హం.

రష్మిక ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ ఈమె మాత్రం పదో స్థానంలో ఉండటంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దేవుడు ఉన్నాడా లేదా.. యూఎస్ స్కూల్ స్టూడెంట్స్‌కు వింత అసైన్‌మెంట్..