జిల్లా పోలీస్ సాయుధ దళ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District ) అధికారులు సిబ్బంది సమర్ధవంతంగా, బాధ్యతాయుతంగా పని చేసినప్పుడే సత్ఫలితాలు సాధ్యం అవుతాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( SP Akhil Mahajan )అన్నారు.సోమవారం తంగళ్లపల్లి మండలం తాడూర్ వద్ద గల జిల్లా పోలీస్ సాయుధ దళ కార్యాలయాన్ని సందర్శించి ఆర్.

 District Sp Akhil Mahajan Inspected The District Police Armed Forces Office-TeluguStop.com

ఐ అడ్మిన్ విభాగం, మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగం, హోమ్ గార్డ్ విభాగాలను తనిఖీ చేసిన ఎస్పీ.ఈ తనిఖీల్లో భాగంగా సాయుధ దళ కార్యాలయంలో ఉన్న సిబ్బంది ఎవరెవరు ఎక్కడడెక్కడ విధులు నిర్వహిస్తున్నారు, సెక్యురిటి విభాగంలో ఎవరెవరు విధులు నిర్వహిస్తున్నారు అని అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు వారి విధులకు సంబందించిన రికార్డ్స్ లను పరిశీలించారు.

ఆర్.ఐ అడ్మిన్ స్టోర్ కు సంబందించిన ఆర్ ఐ స్టోర్ స్టాక్ లెడ్జర్, ప్రభుత్వ ప్రాపర్టీ రిజిస్టర్, లోకల్ పర్చేస్ రిజిస్టర్ ,యాక్షన్ బీడ్ రిజిస్టర్, కండామినేషన్ రిజిస్టర్ లను పరిశీలించి స్టోర్ ను ఏ విదంగా నిర్వహిస్తున్నారు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.

డాగ్ స్క్వాడ్ రికార్డ్స్ ను పరిశీలించి డాగ్ స్క్వాడ్ పని తీరును పరిశీలించారు.బీడీ టీం (బాంబ్ డిస్పోసల్ టీం) కు సంబందించిన రికార్డ్స్ ను , టీం సభ్యులు వాడే ఇన్స్ట్రుమెంట్స్( Instruments ) పరిశీలించారు.

మోటార్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ కు సంబందించిన వాహనాలను, వాటి పని తీరును ఎం టి సెక్షన్ ఆర్.ఐ ని అడిగి తెలుసుకున్నారు.ఆ సెక్షన్ కు సంబందించిన మోటార్ ట్రాన్స్పోర్ట్ రిటర్న్స్ ,లాగ్ బుక్, వెహికిల్ హియర్ చార్జెస్ రిజిస్టర్,వ్ వెహికిల్ రిపేర్ రిజిస్టర్, ఆర్.వి చెక్ రిజిస్టర్ రికార్డ్స్ ను పరిశీలించారు.హోమ్ గార్డ్ సెక్షన్ కు సంబంధించి ఎవరెవరు ఎక్కడ పని చేస్తున్నారు అని తెలుసుకున్నారు.వారికి సంబంధించిన వెల్ఫేర్ క్యాష్ రిజిస్టర్, ఓ డి.క్యాష్ బుక్ రిజిస్టర్, అటాచ్మెంట్ రిజిస్టర్ ఇతర రికార్డ్స్ ను పరిశీలించారు.అనంతరం ఎస్పీ సిబ్బందితో మాట్లాడుతూ…

సిబ్బందికి ఏమైనా విధులకు సంబందించిన సమస్యలు ఉంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించుకోవాలని, సిబ్బంది సర్వీస్ కు సంబంధించి లివ్ లు, సిక్, ప్రమోషన్, ఈ ఎల్ మొదలైనవి హెచ్ ఆర్ ఎం ఎస్ అప్లికేషన్ ద్వారా మాత్రమే అయ్యేటట్లు చూడాలని అందుకు సంబంధిత రైటర్స్ బాధ్యత తీసుకోవాలని అన్నారు.

సిబ్బంది అందరూ కూడా క్రమశిక్షణ తో విధులు నిర్వహించాలని,బందోబస్తు విధులలో,ఎస్కార్డ్ డ్యూటీల సమయంలో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని ఎలాంటి పరిస్థితులను అయిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.ఎస్పీ వెంట ఆర్.ఐ లు కుమారస్వామి, రజినీకాంత్, యాదగిరి, ఆర్.ఎస్.ఐ లు శ్రీనివాస్, శ్రవణ్, రమేష్, సాయి కిరణ్, సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube