దళితుల అభ్యున్నతికే దళిత బంధు పథకాన్ని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాడని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్( Manakondur MLA Rasamayi Balakishan ) అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన కుమ్మరి దేవయ్య కు దళిత బంధు పథకం కింద మంజూరైన నిధులతో ఏర్పాటు చేసుకున్న హోటల్ ను శుక్రవారం మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సందర్శించారు.
ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ దళిత బంధు పథకంతో దళితులు నూతన ఉత్తేజతో ఉన్నారని గత ప్రభుత్వాలు దళితులకు పట్టించుకున్న పాపాన పోలేదని తీవ్రంగా విమర్శించారు.ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) మన మంత్రి కేటీఆర్ చొరవతో దళితుల కోసం దళిత బంధు( Dalit Bandhu ) పథకాన్ని తీసుకువచ్చి దళితుల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
మన ముఖ్యమంత్రి కి దళితులు ఎల్లవేళలా రుణపడి ఉండాలన్నారు.హోటల్ ను సందర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు , జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సిద్ధం వేణుకు , సెస్ చైర్మన్ చిక్కాల రామారావుకు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య కు హోటల్ యజమాని టిఫిన్ తిని వెళ్ళవలసిందిగా కోరాడు.
అయనా కోరిక మేరకు హోటల్ లో వారు కాసేపు ఆగి మిర్చి తింటూ చాలా రుచికరంగా ఉన్నాయన్నారు.హోటల్ ఏ విధంగా నడుస్తుందని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , వీర్నపల్లి రైతు బంధు అధ్యక్షులు ఎడ్ల సాగర్ , సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు హాన్మాండ్లు , గజల్ లాల్ నాయక్, గోగుల రమేష్ , తదితరులు పాల్గొన్నారు
.