ఆడబిడ్డలకు సర్కార్ కానుక కళ్యాణలక్ష్మీ సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని భూరుగుపల్లి, కోరేం, స్థంభంపల్లి, దుండ్రపల్లి, మల్కాపూర్ గ్రామాలకు చెందిన 15 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను బోయినిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పంపిణి చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.
2014 ముందు ఆడపిల్లల పెళ్లి చేయాలంటే పేదవాళ్లు అప్పు చేసి పెళ్లి చేసేవారని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా మారి ఒక్క లక్ష 116 రూపాయలను పేద ప్రజలకు చెక్కుల రూపంలో నేరుగా ఇస్తున్నామని తెలిపారు.ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఆడబిడ్డలకు ఒక భరోసాగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, రైతుబంధు అధ్యక్షుడు లచ్చిరెడ్డి ,మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండయ్య, కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ అజ్జూ,నాయకులు సంభ లక్ష్మీరాజము, గుంటి శంకర్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.