కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత పాలన వల్ల నిరుద్యోగ ఆత్మహత్యలు :కేకే మహేందర్ రెడ్డి

Unemployment Suicides Due To Incompetence Of Central And State Governments KK Mahender Reddy , KK Mahender Reddy, Unemployment, Praveen Tony, Guggilla Bharat Goud

చేతగాని ప్రభుత్వం గద్దె దిగాలి ఉద్యమ ఆకాంక్షలు అన్ని నెరవేర్చాలి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత పాలన వల్ల నిరుద్యోగ ఆత్మహత్యలు :కేకే మహేందర్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా :రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం లోని బివై నగర్ కు చెందిన చిటికెన నవీన్ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.ఆ కుటుంబ సభ్యులను పరమర్శించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి.

 Unemployment Suicides Due To Incompetence Of Central And State Governments Kk Ma-TeluguStop.com

అనంతరం కేకే మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగం అనేది లేకుండా చేస్తా అని తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి డబ్బులు ఖర్చు పెట్టుకుని కుటుంబానికి అండగా ఉండాలని, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న యువత ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న దగా కోరుతనానికి,దోపిడీ పాలనకు బలి కావలసిన పరిస్థితి ఏర్పాటయిందనీ ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్య వహిస్తున్న కేటీఆర్ ఈ జిల్లాలో జరిగిన ఆత్మహత్యలపై కనీసం పరామర్శకు రాకుండా సోషల్ మీడియా వేదికగా మాట్లాడడం హేయమైన చర్య అని ఆరోపించారు.

నేతి బీరకాయ లోని నెయ్యి ఎంత నిజమో కేసీఆర్,కేటీఆర్ మాటలు,వారి పాలన అంతే నిజం.కేటీఆర్ కు దోపిడీ పై ఉన్న ప్రేమ”లీక్ లపై ఉన్న శ్రద్ధ,నిరుద్యోగుల పై లేక పోవడం,లిక్కర్ స్కాం కోసం పెట్టె శ్రద్ధ నిరుద్యోగుల కోసం కొంతైనా ఉంటే బాగుండన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుద్యోగ యువతకు భరోసా కల్పించే విధంగా ఉద్యోగ ప్రకటనలు ఇచ్చి వారిని ఆదుకోవాలి, అలాగే ఏదైతే మీరు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని హామీలు ఇవ్వడం కాకుండా నిరుద్యోగ భృతిని కూడా అర్హులైన వారందరికీ చెల్లించాలని డిమాండ్ చేశారు.ముమ్మాటికి నిరుద్యోగ ఆత్మహత్యలని ప్రభుత్వ హత్యలే ఈ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం గా కనబడుతున్నాయనీ,వెంటనే గత ఆరు మాసాల క్రితం తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి ఆరేపల్లి విష్ణు కుటుంబాన్ని అలాగే నిన్నటి రోజున సిరిసిల్ల పట్టణానికి చెందిన చిటికెన నవీన్ కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని వారికి ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు.

ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నవీన్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో సిరిసిల్ల పట్టణ నాయకులు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు,సీనియర్ నాయకులు కౌన్సిలర్ చొప్పదండి ప్రకాష్,మైనార్టీ నాయకులు ఎండి కాజా,యూత్ నాయకులు గంభీరావుపేట ప్రశాంత్, తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ, జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి మునిగల రాజు, జిల్లా పార్టీ హ్యూమన్ రైట్స్ కన్వీనర్ గుగ్గిళ్ళ భరత్ గౌడ్ తదితరులు ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube