రంజాన్ పండుగకు సౌకర్యాలు కల్పించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా :రంజాన్ పండుగ ( Ramadan )సందర్భంగా జిల్లా లోని అన్ని మసీదులు, ఈద్గాల వద్ద సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్( Kheemya Naik ) ఆదేశించారు.రంజాన్ మాసం సందర్భంగాజిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులు, మసీద్, ఈద్గా కమిటీలు, ముస్లిం నాయకులతో సోమవారం పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

 Facilities Should Be Provided For The Festival Of Ramzan-TeluguStop.com

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడారు.

రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో మసీదులు( Mosque ), ఈద్గాల వద్ద నిత్యం పారిశుధ్య పనులు చేయించాలని, తాగునీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.

నమాజ్ చేసే సమయంలో విద్యుత్ సరఫరా లో కోతలు ఉండకూడదని సూచించారు.ఖబ్రస్థాన్ల వద్ద మొరం పాటించాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయించాలని వివరించారు.పట్టణాల్లో మున్సిపల్, గ్రామాల్లో గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని పోలీసులకు సూచించారు.

పలువురు ముస్లిం నాయకులు అధికారుల దృష్టికి సమస్యలు తీసుకురాగా, పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.ముస్లింలు అందరూ రంజాన్ పండుగను శాంతి యుతంగా, సుఖ శాంతులతో చేసుకోవాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు రమేష్, రాజేశ్వర్, ఇంచార్జీ డిస్ట్రిక్ట్ మైనార్టీ అండ్ వెల్ఫేర్ ఆఫీసర్ రాధాబాయ్, వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, డీసీఎస్ఓ జితేందర్ రెడ్డి, ఓఎస్డీ సురేమియా తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube