అందరం ఒక్కటై అభివృద్ధికి పాటు పడుదాం - మండల నూర్ బాషా దూదేకుల సంఘం అధ్యక్షుడు మహ్మద్ సలావోద్దీన్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలకేంద్రంలో ఆర్య వైశ్య భవన్ లో ఇల్లంతకుంట నూర్ బాషా దూదేకుల సంఘం సమావేశం ఇల్లంతకుంట మండల నూర్ బాషా దూదేకుల సంఘం అధ్యక్షుడు మహ్మద్ సలావోద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈకార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన అధ్యక్షులు సంఘం సభ్యులు మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

 Let Us All Work Together For Development Mandal Noor Basha Dudekula Association-TeluguStop.com

సంఘం అధ్యక్షుడు మొహ్మద్ సలావోద్దీన్ మాట్లాడుతూ సంఘం యొక్క అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందించాలని .మండలంలో ఇప్పటి వరకు నూర్ బాషా సంఘం యొక్క భవనం నిర్మాణం లేదని అది తొందరలోనే పూర్తి చెసుకునేందుకు మళ్ళీ ఒక్కసారి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని,

అలాగే ఇల్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న నూర్ బాషా సంఘం అధ్యక్షులు మీ కమిటీ సభ్యులు మీ సమస్యలు తెలపాలని అవి పరిష్కరించే దిశగా ముందుకు అందరం కలిసి సాగుదమని అన్నారు.ఇంకా మండలంలోని సంఘం కోసం తప్పనిసరి రాజకీయాలు వదిలి అందరం ఒక్కటై ముందుకు సాగి సంఘం అభివృద్ధి కి పాటు పడాలని కోరారు.ఈకార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహ్మద్ సలావోద్దీన్ తో పాటు మండల జెనరల్ సెక్రెటరీ మహ్మద్ ఉస్మాన్, ఉపాధ్యక్షులు మహ్మద్ జలాల్, రాజ్ మహ్మద్,మహ్మద్ రఫీ, సంఘం సభ్యులు మంజూర్ అలీ,మహ్మద్ జమాల్,మహ్మద్ అలిమ్, మహ్మద్ షాదుల్ ఇల్లంతకుంట గ్రామ ఉప సర్పంచ్,మండల కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ సలీమ్,జలీల్,క్యాషియర్ సలావోద్దీన్ తో పాటు హైదర్, మైమూడ్,యూసుఫ్, హకీమ్,మండల నూర్ బాషా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube