బుల్లితెర రియాలిటీ షోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈ కార్యక్రమం తెలుగులో ఏడవ సీజన్ ప్రసారమవుతుంది 14 మంది కంటెస్టెంట్లతో సెప్టెంబర్ మూడవ తేదీ ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఇప్పటికే రెండు వారాలను పూర్తి చేసుకుంది.
మొదటి వారం కిరణ్ రాథోడ్ హౌస్ నుంచి ఎలిమినేట్ గా రెండవ వారం షకీలా ఎలిమినేట్ అవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ బట్టి చూస్తే ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోయింది అంటూ విన్నర్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సీజన్లో ఎవరైతే పవర్ ఆస్త్రాన్ని గెలుచుకుంటారో వారే కంటెస్టెంట్ గా ఎంపిక అవుతారంటూ నాగార్జున ( Nagarjuna ) మొదట్లో చెప్పిన సంగతి తెలిసిందే.అయితే రెండవ వారంలో భాగంగా అమర్ దీప్,షకీలా, శివాజీ( Shivaji ) ముగ్గురు పోటీదారులు అరిచినప్పుడు డెసిబెల్స్ ఎవరికి ఎక్కువగా వస్తాయో వాళ్లే ఇందులో విజేత అని ముందే చెప్పారు.ఇక, ఈ టాస్కులో శివాజీ విజేతగా నిలబడ్డారు అయితే ఈయన గట్టిగా అరిచి +11 డేసి బెల్స్ సంపాదించుకోవడం గురించి మాట్లాడుతూ మైక్‌కు బాగా దగ్గరగా కానీ, దూరంగా కానీ ఉండకుండా ఉంటేనే సౌండ్ అనుకున్న విధంగా వెళ్తుందట.ఈ విధంగా శివాజి మైండ్ గేమ్ ఆడి ఈ టాస్క్ గెలిచారని తెలుస్తోంది.
ఇలా శివాజీ మైండ్ గేమ్ ఆడుతూ ఉంటే కనుక తప్పనిసరిగా ఈయనే బిగ్ బాస్ విన్నర్ ( Bigg Boss Winner ).అవుతారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని ఈ టాస్క్ ద్వారా స్పష్టం అవుతుంది.మరి శివాజీ అనుకున్న విధంగానే కప్పుతో బయటకు వస్తారా లేక ఏదైనా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుని ఈయన మధ్యలోనే హౌస్ నుంచి బయటకు వస్తారా అన్న విషయం తెలియదు కానీ ఇప్పటికైతే శివాజీనే విన్నర్ అవుతారు అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.