కవ్వంపల్లి నోరు అదుపులో పెట్టుకో.. నీ బాష మారకుంటే గుణపాఠం తప్పదు - ఇల్లంతకుంట వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎంపీటీసీలతో కలిసి మంగళవారం రోజున వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ సోమవారం రోజున ఇల్లంతకుంట మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కవ్వంపల్లి సత్యనారాయ, ఎంపీపీ వెంకటరమణ రెడ్డి మాట్లాడినవన్ని అబద్దాలని ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు.

 Vice Mpp Srinath Goud Condemns Kavvampalli Comments On Rasamai Balakishan,, Vice-TeluguStop.com

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సైతం వదిలేసి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి, రెండు సార్లు ఎమ్మెల్యే గా భారీ మెజారిటీతో గెలుపొందిన మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను కవ్వంపల్లి సత్యనారాయణ వాడు, వీడు అంటూ మాట్లాడటం పద్ధతి కాదన్నారు.

కవ్వంపల్లి వెంటనే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్షమాపణలు చెప్పాలి.

ఎమ్మెల్యే రసమయి ని స్థానికేతరుడు అంటున్నావ్.నువ్వు హైదరాబాద్ వెళ్లి ఆస్పత్రులు పెట్టుకుని ఎందుకు బ్రతుకుతున్నావ్, ప్రజల దగ్గర నుంచి లక్షలు వసూళ్లు చేస్తున్నావ్.

నీకు ప్రజలపై ప్రేమ ఉంటే ఆస్పత్రి కట్టి ప్రజలకు ఉచితంగా వైద్యం అందించు దమ్ముంటే.మా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిత్యం ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నారు.

అయ్యా ఎంపీపీ వెంకటరమణ రెడ్డి మండలంలో నీ ముఖం ఎలా ఉంటుందో ఎవరికి తెలియని సమయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిన్ను ఇల్లంతకుంట మండలానికి తీసుకొచ్చి సెస్ డైరెక్టర్, ఎంపీపీ పదవులను ఇచ్చారు.ఎన్నికలకు ముందుగానే నిన్ను ఎంపీపీ అభ్యర్థి అని ప్రకటించారు.

నీ ఎలక్షన్ కోసం ఎమ్మెల్యే రసమయి ఎంతో కష్టపడ్డాడు.బీఆర్ఎస్ పార్టీ భీ ఫామ్ పై ఎంపీటీసీ గా గెలిచి ఎంపీపీ అయిన మీరు మీ పదవికి రాజీనామా చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.

మానకొండూర్ ఎమ్మెల్యే గా రసమయి బాలకిషన్ ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో గెలుస్తున్నారు.ఖచ్చితంగా మూడవ సారి కేసీఆర్ సీఎం కాబోతున్నారు.ఎమ్మెల్యే ఎన్నికల ముందు మీరు పార్టీ మారడంలో ఆంతర్యం ఏమిటి.?ఎంపీపీ తన పదవికి రాజీనామా చేయాలి.ఇటీవల కాంగ్రేస్ పార్టీలో చేరిన ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ బీ ఫాం మీద గెలిచిన వారు కాదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు ఒగ్గు నర్సయ్యయాదవ్, గొట్టెపర్తి పర్శరాం, తీగల పుష్పలత, బర్ల తిరుపతి, సావనపెళ్లి వనజ అనీల్, పట్నం అశ్విని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube