అధిక రక్తపోటుదీనేని హై బీపీ, హైపర్ టెన్షన్ అని కూడా పిలుస్తుంటారు.రక్త పోటు స్థాయిలు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండటమే అధిక రక్తపోటు అంటారు.
ఈ హై బీపీ ఏర్పడినప్పుడు తీవ్రమైన తల నొప్పి, గుండె దడ, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, అతి కోపం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.వీటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.
ప్రాణాలకే ముప్పుగా మారుతుంది.అందుకే వీలైనంత త్వరగా రక్త పోటును అదుపు చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే అధిక రక్త పోటును కంట్రోల్ చేయడంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.అలాంటి వాటిలో ఆప్రికాట్లు కూడా ఉన్నాయి.ముఖ్యంగా ఎండిన (డ్రై) ఆప్రికాట్లు హై బీపీను అదుపు చేయడంలో గ్రేట్‌గా సహాయపడతాయి.డ్రై ఆప్రికాట్స్‌లో పొటాషియం, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి.
అందుకే ఆప్రికాట్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.ముఖ్యంగా అధిక రక్త పోటుతో బాధ పడే వారు ప్రతి రోజు నాలుగు డ్రై ఆప్రికాట్లు లేదా ఆప్రికాట్ల జ్యూస్ తీసుకోవాలి.ఇలా చేస్తే వాటిలో పుష్కలంగా ఉండే పొటాషియం రక్త పోటు స్థాయిలను అదుపు చేస్తుంది.అదే సమయంలో హార్ట్ బీట్ ను రెగ్యులేట్ చేస్తుంది.
ఇక డ్రై ఆప్రికాట్లు తింటే బీపీ కంట్రోల్ అవ్వడంతో పాటు రక్త హీనత పరార్ అవుతుంది.ఉబ్బసం, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు దూరం అవుతాయి.
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.
అతి ఆకలి తగ్గు ముఖం పడుతుంది.దాంతో బరువు తగ్గవచ్చు.
కంటి చూపు పెరుగుతుంది.పాలిచ్చే తల్లులకు, ప్రెగ్నెంట్స్‌కు కూడా ఆప్రికాట్లు ఎంతో మేలు చేస్తాయి.
కాబట్టి, అందరూ వీటిని డైట్‌లో చేర్చుకుంటే మంచిది.