సర్దాపూర్ 17వ పోలీస్ బెటాలియన్ లో సిపిఆర్ పై అవగాహన

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని   హిమాన్షి హాస్పిటల్,శ్వాస హాస్పిటల్స్ సి.యమ్.

 Awareness Of Cpr In Sardapur 17th Police Battalion , 17th Police Battalion, Cpr-TeluguStop.com

డి డాక్టర్ సురేంద్రబాబు, యమ్.డి పీడియాట్రిక్స్, డాక్టర్ పి.యస్ రాహుల్ , యమ్.డి పల్మనాలజి, డాక్టర్ నీలిమ,యమ్.డి పీడియాట్రిక్స్ వైద్యబృందం 17వ పోలీస్ బెటాలియన్ సిబ్బందికి  సి.పి.ఆర్ పై  అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వ్యక్తి ఊపిరి తీసుకోలేక పోతున్నారో లేక పల్స్ అందలేదో అప్పుడు సి.పి.ఆర్ ప్రక్రియ చేయాలి.ఎప్పుడైతే సి.పి.ఆర్ ని నిర్వహిస్తారో అప్పుడు రక్తం సరఫరా బాగా జరుగుతుంది.దాంతో కొంత సమయం ప్రాణాలతో ఉండగలరు అని.ఇలా చేస్తూ ఉండగానే అంబులెన్స్ కి ఫోన్ చేయడం చాలా అవసరము అని సి.పి.ఆర్ చేసే విధానాన్ని గురించి  పోలీస్ బెటాలియన్ సిబ్బందికి అవగాహన కల్పించారు.సిబ్బందికి గుండె సంబంధిత పలు అనుమానాలను నివృత్తి  చేసి తగు సూచనలు చేశారు.

అలాగే నిత్యజీవితంలో ఎదురయ్యే కొన్ని మానసిక సమస్యలపై అవగాహన కల్పించారు.ఈ  సందర్బంగా బెటాలియన్ కమాండెంట్  యస్.శ్రీనివాస్ మాట్లాడుతూ గుండె జబ్బులతో బాధపడే వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ హార్ట్ఎటాక్‌కు సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ తెలుసుకోవాలి అని ఎందుకంటే ఎమర్జెన్సీ పరిస్థితులలో ఎవరికైనా మీరు సహాయం అందించి వారి ప్రాణాలను కాపాడవచ్చు .కాబట్టి ఈ క్విక్ యాక్షన్‌ను తప్పకుండా తెలుసుకోవాలని అంతేకాక ప్రాణాలు కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.

ఎల్లప్పుడూ విధి నిర్వహణలో ఉండటం వల్ల హెల్త్ గురుంచి కేర్ తీసుకునే టైమ్ ఉండదు.కానీ ప్రతి ఒకరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుని వ్యాయామం, యోగ లాంటివి చేయాలనీ బలమైన పౌష్టికాహారం తీసుకోవాలి అన్నారు.

సిబ్బందికి పి.యఫ్.టి, బి.పి, షుగర్ మొదలైన వైద్య పరీక్షలు నిర్వహించి తగు సలహాలు సూచనలు చేశారని తెలిపారు.ఈ సందర్భంగా శ్వాస హాస్పిటల్ ,హిమన్షు హాస్పిటల్స్  వైద్య బృందానికి కమాండెంట్ యస్.శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఎ.జె.పి నారాయణ, యమ్.పార్థసారథి రెడ్డి ,అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube