ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రులు జరుపుకోవాలి - బోయినిపల్లి ఎస్సై మహేందర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై మహేందర్ అన్నారు.బోయినపల్లి మండలం నిలోజిపల్లి లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు గ్రామస్థుల తో సమావేశం ఏర్పాటు చేశారు.

 Vinayaka Navratri Should Be Celebrated In Peaceful Atmosphere Boinipally Si Mahe-TeluguStop.com

ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నిమజ్జన సమయంలో డీజేలకు అనుమతులు లేవని ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని అన్నారు.

నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలని చెరువుల వద్దకు కుంటల వద్దకు చిన్న పిల్లలను తీసుకెళ్లద్దని సూచించారు.పోలీసులు సూచించిన విధంగా శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమం చేపట్టాలని అన్నారు.

గణేష్ మండపాల వద్ద నిమజ్జన సమయంలో డీజీలకు అనుమతులు లేవని అన్నారు.యువత గంజాయి మత్తులో భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు ఎవరైనా గంజాయి కి బానిస అయినవారు ఉంటే ప్రత్యేక వైద్యుని పర్యవేక్షణలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎస్సై వెంట సిబ్బంది కోటి ,రమేష్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube