కంటి వెలుగు ను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఇల్లంతకుంట ఎమ్మార్వో రవికాంత్ తో కలిసి ప్రారంభించిన ఇల్లంతకుంట మండల వైస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్.ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు.

 People Should Make Good Use Of The Light Of The Eye , Eye, Illantakunta, Vice Mp-TeluguStop.com

అందత్వ నిర్మూలనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.కంటి వెలుగు శిబిరంలో భాగంగా ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు చేయడమే కాకుండా ఉచితంగా మందులు, ఖరీదైన అద్దాలను ప్రభుత్వమే అందిస్తుందని అన్నారు.

అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు ప్రభుత్వమే ఉచితంగా చేపిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఉచితంగా కంటి పరీక్షలు చేసుకోవాలని కోరారు .ఈ కార్యక్రమం లో మండల తహశీల్దార్ రవికాంత్,వైద్యాధికారి,కట్ట రమేష్, ఉప సర్పంచ్ బోయిని పద్మ – పర్శరాం, వార్డు సభ్యులు అన్నాడి నవీన్ రెడ్డి, దురుముట్ల శ్రీనివాస్, వి.ఆర్.ఓ సింగారెడ్డి, పంచాయితీ కార్యదర్శి సరస్వతి, ఏ ఎన్ ఎం జ్యోతి, స్టాఫ్ నర్స్ సంధ్య, ఆశాలు పద్మ , విజయ , సౌమ్య , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube