కృతజ్ఞత సభను విజయవంతం చేయండి - జెడ్పీ కో ఆప్షన్ చాంద్ పాష

రాజన్న సిరిసిల్ల జిల్లా: మెడికల్ కాలేజీ ప్రారంభం సందర్భగా కృతజ్ఞత ర్యాలీ , కృతజ్ఞత సభ కు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లాకు మెడికల్ కాలేజీ ఓ స్వప్నం అని జెడ్పీ కో ఆప్షన్ చాంద్ పాషా అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డిగ్రీ కాలేజ్ కి బుధవారం వెళ్లి విద్యార్థులతో చాంద్ పాషా మాట్లాడుతూ.

 Make Medical College Inaguration Meeting A Grand Success Zp Co Option Chand Pash-TeluguStop.com

తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువ చేయడంతో పాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య ,విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభిస్తున్నారని పేర్కొన్నారు.తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే,

ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేర్చించిందని అన్నారు.

నాడు తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే, ఇప్పుడు 8340 సీట్లకు పెరిగిందని రాష్ట్ర విద్యార్థులను అధిక సంఖ్యలో డాక్టర్లుగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినయోగం చేసుకోలని పిలుపునిచ్చారు.

ఈనెల 15 న దేశం చరిత్ర లో చిరకాలం నిలిచి పోయోవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా తొమ్మిది మెడికల్ కాలేజీలను వర్చువల్ గా ప్రారంభం చేసుకుంటున్న శుభ సందర్బంగా మెడికల్ కాలేజీ మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా ,కృతజ్ఞత ర్యాలీ కి కృతజ్ఞత సభ కు పెద్ద ఎత్తున తరలిరావాలి సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube