టాలీవుడ్ హీరో లకు సంక్రాంతికి తమ సినిమా లను విడుదల చేయాలని ఎప్పుడు కోరికగా ఉంటుంది.ఎప్పుడు కూడా తెలుగు హీరో లు సంక్రాంతికి వచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.
సంక్రాంతి సీజన్ తర్వాత పరీక్ష లు వస్తాయి.కనుక మళ్లీ రెండు నెలల గ్యాప్ ఇవ్వాలి.
సమ్మర్ లో ఎంత పోటీ ఉంటుందో అందుకే సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందని అంతా భావిస్తూ ఉంటారు.అందుకే గత సంక్రాంతికి చిరంజీవి మరియు బాలకృష్ణ( Nandamuri Balakrishna ) సినిమా లతో పాటు చాలా సినిమా లు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం జరిగింది.
అందుకే వచ్చే సంక్రాంతికి కూడా బాలయ్య రాకున్నా కూడా చిరంజీవి కచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపించింది. నాగార్జున ( Nagarjuna )తన నా సామిరంగ సినిమా( Naa Saami Ranga ) తో సంక్రాంతికి రాబోతున్నాడు.ఆ విషయం లో ఎలాంటి అనుమానం అక్కర్లేదు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు బలంగా మాట్లాడుకుంటున్నారు.చిరంజీవి మరియు నాగార్జున సంక్రాంతికి రాబోతుండగా, అంతే స్థాయి లో యంగ్ స్టార్ హీరో లు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తారని అంతా భావిస్తున్నారు.
ఇలాంటి సమయంలో చిరంజీవి ఈ సంక్రాంతికి రావడం లేదు అంటూ యూవీ క్రియేషన్స్ వారు క్లారిటీ ఇచ్చారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చిరంజీవి సినిమా ఇటీవలే మొదలు అయింది.
అందుకు సంబంధించిన హడావుడి మొదలు అయింది.కనుక ముందు ముందు షూటింగ్ ను స్పీడ్ గా నిర్వహించి సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు.కానీ సంక్రాంతికి సినిమా విడుదల సాధ్యం కాదని యూవీ వారు ప్రకటించడం తో అభిమానులు ఉసూరుమంటున్నారు.నాగార్జున స్పీడ్ గా సినిమా ను పూర్తి చేసి విడుదల చేయగలడు.
కానీ చిరంజీవి సినిమా ఫాంటసీ సినిమా.కనుక కాస్త స్లో గానే సినిమా ను రూపొందించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.