బి.ఎస్పీతోనే బీసీలకు సమన్యాయం : బట్టు రామచంద్రం

బహుజన్ సమాజ్ పార్టీ( Bahujan Samaj Party ) రాజన్న సిరిసిల్ల పట్టణ అధ్యక్షులుగా తడుకభాను,జిల్లా కార్య నిర్వాహక కమిటీ ఇంచార్జిగా అరుకల రమేష్ లను నూతనంగా నియమించిన సందర్భంగా మంగళవారం జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ అధ్యక్షుడు మధుకర్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.సిరిసిల్ల పట్టణంలోని పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సుమారు యాబైమంది నాయకులు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు స్వామీగౌడ్,రాష్ట్ర పార్టీ సలహా కమిటీ సభ్యుడు ఎనగందుల వెంకన్న సమక్షంలో పార్టీలో చేరారు.

 Reservation Should Be Given To Bcs,bc,minority,reservation,telangana,rajanna Sir-TeluguStop.com

వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోని ఆహ్వానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇంచార్జి బట్టు రామచంద్రం హాజరై ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం( Telangana )లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ద్వారా మార్పు మొదలైందని ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతా అనే నినాదాన్ని కాన్సీరాం భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న బహుజన సమాజం పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తుందన్నారు.52 శాతం జనాభా ఉన్న బీసీలకు 70 అసెంబ్లీ సీట్లను కేటాయించిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ బీసీ సమాజం రాజ్యాధికారం దిశగా ప్రయాణిస్తుందని ఉన్నత వర్గ పార్టీలు బీసీ వర్గాలను రాజకీయ క్రీడ వస్తువుగా చూస్తూ వివిధ రకాల రాయితీలను ప్రకటిస్తూ మభ్యపెడుతుంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం రాజ్యాధికారంలో వాటాదారులుగా చేసేందుకు సబ్బండ కులాలను ఏకం చేస్తున్నారన్నారు.విద్యావంతులైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేదలంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు మహేందర్, ప్రచార కార్యదర్శి యారపు రాజబాబు,చెట్టిపల్లి నరేందర్,ఆంజనేయులు, రాజు, మెర్గు రాజు,మెర్గు శీను,గడ్డం కమలాకర్,గుంటుక రమేష్, నాగరాజు,ఆడెపు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube