రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం అంబేద్కర్ కాలనీలో ఇటీవలే ప్రమాదవశాత్తు ప్రహరి గోడ కూలి ఊపిరాడక తల్లి వాడే దేవవ్వ (36) కూతురు అక్షయ (16) లను స్థానికులు కూలిన గోడ కింద ఉన్న వీరిని బయటకు తీసి వెంటనే ఆసుపత్రికి తరలించారు.దేవవ్వ అప్పటికే మరణించిందని వైద్యులు నిర్ధారించారు.
కూతురు అక్షయకు తీవ్రమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ అక్షయ కూడా మృతి చెందింది.
ఇట్టి సంఘటనతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మృతి చెందిన దేవవ్వకు భర్త నర్సయ్య మరో ఐదు సంవత్సరాల కూతురు ఉన్నారు.కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి, ఇట్టి విషయాన్ని తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ మనసు చలించి తమవంతుగా ఐదువేల రూపాయల నగదు, 50 కిలోల బియ్యం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.