నకిలీ విత్తనాల ఉత్పత్తి,అమ్మేవారిపై క్రిమినల్ కేసులు, పి.డి.యాక్ట్ నమోదు.

పోలీస్,వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు తనిఖీలు,అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి నకిలీ విత్తనాలు అమ్మేవారి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( SP Akhil Mahajan )రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ రోజు జిల్లా పోలీస్,వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ తో కలసి జిల్లలో నకిలీ విత్తనాలను అరికట్టడానికి తీసుకోవలసిన చర్యల మీద సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

 Production Of Fake Seeds, Criminal Cases Against Sellers, Registration Of P.d.ac-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వానాకాలం సాగు ప్రారంభమవుతున్న వేళను దృష్టిలో వుంచుకోని రైతన్న నకిలీ విత్తనాల బారీన పడకుండా ముందస్తు చర్యలకై జిల్లా పోలీసులు సిద్ధంగా ఉన్నారని నకిలీ విత్తనాల సరఫరా ,ఉత్పత్తి, అమ్మకాలు అరికట్టడానికి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయిలో ప్రత్యేక స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి వ్యవసాయ శాఖ అదికారులతో కలసి ఎప్పటికప్పుడు తనిఖీలు, అవగాహన సదస్సులు నిర్వహింస్తామన్నారు.జిల్లా పరిధిలో ఎవరైన వ్యాపారస్థులు,సంస్థలు,వ్యక్తులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందితే తక్షణమే స్పెషల్ బ్రాంచ్ సి.

ఐ కరుణాకర్ ( CI Karunakar )ఫోన్ నెంబర్ 87126 56411 కి లేదా డయల్ 100,స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా వుంచబడటంతో పాటు,కీలక సమచారం అందించిన వ్యక్తులకు పారితోషకాలను అందించడం జరుగుతుందని ఎస్పి తెలిపారు.గతంలో నకిలీ విత్తనాల కేసుల్లో సంబంధం ఉన్నవారి పై నిఘా ఉంచాలిని,మళ్ళీ వాళ్ళు ఆదేతరహాలో అమ్మిన,జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలు సరఫరా,అమ్మకాలు జరిపితే వారిపై క్రిమనల్ కేసులు నమోదు చేయడంతో పాటు పి.డి.యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.అదేవిధంగా రైతులు విత్తనాలను వ్యవసాయ శాఖ నిర్దేశించిన దుకాణాల్లో మాత్రమే ఖరీదు చేయడం మంచిదని,నకిలీ విత్తనాలు, పురుగుల మందులు అమ్మే వారి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఈ సందర్భంగా కోరారు.జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ మాట్లాడుతూ.

రైతులు నకిలీ విత్తనాలను కొని మోసపోకుండా విత్తనాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండి, ఒకటికి రెండు సార్లు సరిచూసుకొని కంపెనీ ధృవీకరించబడిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.పత్తి సాగు చేయాలనుకునే రైతులు సర్టిఫైడ్ కంపెనీ సీడ్ ఆర్గనైజర్ వద్దనే విత్తనాలు తీసుకోవాలని,వాటిని రైతులు కొనుగోలు చేసినప్పుడు ఆర్గనైజర్ నుండి రశీదు పొందాలని, అలాగే తీసుకున్న ప్యాకెట్ కవర్స్ ను పంట పూర్తి అయ్యేవరకు రైతులు తమ దగ్గరే ఉంచుకున్నట్లైతే ఆయా విత్తనాలను సాగు చేయడం వల్ల రైతు నష్టాలు పొందినట్లైతే సంబంధిత ఆర్గనైజర్ ను,కంపెనీని,బాధ్యులను చేయుటకు రైతు తీసుకున్న రశీదు, ప్యాకెట్ కవర్లు ఒక ఆధారంగా ఉపయోగపడుతాయని అట్టి ఆర్గనైజర్, కంపెనీ పై కఠిన చర్యలు తీసుకొనుటకు అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య , డిఎస్పీ లు విశ్వప్రసాద్, నాగేంద్రచారి, రవికుమార్, సి.ఐ లు ఎస్.ఐ లు మండల స్తాయి వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube