#RRR వంటి సెన్సేషన్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కొద్దిరోజుల క్రితమే ప్రారంభం అయ్యింది.
హైదరాబాద్ లోని కొన్ని పరిసర ప్రాంతాల్లో మరియు రామోజీ ఫిలిం సిటీ లో కొన్ని రోజులు మొదటి షెడ్యూల్ కి సంబంధించిన షూటింగ్ చేసారు.ఇక ఫ్యాన్స్ మొత్తం ఎప్పుడెప్పుడా అని ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసారు.
వాళ్ళ ఎదురు చూపులకు తెరదించుతూ రేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు.ఈ చిత్రానికి ‘దేవర’ ( Devara )అనే టైటిల్ ని కూడా ఖరారు చేసారు.
నల్లని దుస్తులతో పొడవాటి కత్తి ని పట్టుకొని , సేవలతో నిండి ఉన్న పడవలో ప్రయాణిస్తూ స్టైల్ గా ఎన్టీఆర్ నిల్చున్న ఫోజుకి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ సినిమా స్టోరీ లైన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని తెగ కలవర పెడుతుంది.భయం అనేది తెలియకుండా బ్రతుకుతున్న మృగాలకు అతనిని చూస్తే వణుకు పుడుతుంది అనే లైన్ మీద ఈ సినిమాని తీస్తున్నాను అని కొరటాల శివ మూవీ ముహూర్తం రోజే తెలిపాడు.ఇప్పుడు పూర్తి స్థాయి స్టోరీ లైన్ సోషల్ మీడియా లో లీక్ అయిపోయింది.
వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ ఇందులో సముద్ర తీరాన ఒక స్మగ్లర్ గా పని చేస్తూ ఉంటాడు.అతనితో పోటీగా సైఫ్ అలీ ఖాన్ కూడా ఇదే వ్యాపారం చేస్తూ ఉంటాడు.
ఇద్దరి మధ్య మొదటి నుండి క్లాష్ ఉంటుంది.ఒకానొక సందర్భం లో సముద్ర నడిబొడ్డున స్మగ్లింగ్ గూడ్స్ తో ప్రయాణిస్తున్న ఎన్టీఆర్ మరియు అతని దళం పై దాడి జరిపి అందరినీ చంపేస్తారు సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan )గ్యాంగ్.
అప్పుడు సైఫ్ అలీ ఖాన్ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ‘దేవర’ కొడుకు (మరో ఎన్టీఆర్) వాళ్ళ రాజ్యం లోకి అడుగుపెడతాడు, చివరికి ప్రతీకారం తీర్చుకున్నాడు లేదా అనేదే స్టోరీ.
మన చిన్నతనం నుండి ఇలాంటి స్టోరీలను చూస్తూనే పెరిగాం, మళ్ళీ స్టోరీ తో సినిమా అంటే సాహసం అనే చెప్పాలి.ఇక కొరటాల శివ టేకింగ్ స్టైల్ చాలా స్లో గా ఉంటుంది, ఆయన ఈ చిత్రం పై ప్రత్యేక శ్రద్ద పెట్టి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా సినిమా తియ్యకపోతే ఈ చిత్రం కూడా ఆయన గత చిత్రం ఆచార్య లాగానే మిగిలిపోతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.కానీ కొరటాల శివ పై ఫ్యాన్స్ నమ్మకం పెట్టలేకున్నారు.
ఎందుకంటే ‘ఆచార్య’ సినిమాని ఆయన ఆ రేంజ్ లో తీసాడు.జూనియర్ ఎన్టీఆర్ కాకుంటే కొరటాల శివ కి ఆ టేకింగ్ చూసిన తర్వాత ఒక్క టాలీవుడ్ స్టార్ హీరో కూడా అవకాశం ఇచ్చేవాడు కాదు.
స్టార్ హీరో దాకా కూడా వెళ్లనవసరం లేదు, మీడియం రేంజ్ హీరోలు కూడా కొరటాల తో చెయ్యడానికి భయపడే రేంజ్ లో ‘ఆచార్య’ సినిమా తీసాడు.అలాంటి సినిమాని చూసిన తర్వాత ఎన్టీఆర్ లాంటి స్టార్ కొరటాల కి అవకాశం ఇచ్చాడంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి.
మరి ఎన్టీఆర్ నమ్మకాన్ని కొరటాల నిలబెడుతాడా లేదా అనేది చూడాలి.