ఆడవాళ్ళని నమ్మించి, వాడుకుని వదిలేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సినీ రంగంలో ఐతే ఇది మరీ ఎక్కువ.
ప్రేమ పేరుతో నమ్మించి, మోజు తీరాక వదిలేస్తారు.అలాంటి వారిలో ఎంజిఆర్ ఒకరు.
ఎంజీఆర్ అంటే తమిళ సినీ పరిశ్రమలో తిరుగులేని హీరో.హీరోగా, సిఎంగా ఎంత ఎత్తుకు ఎదిగారో అంతే ఎత్తు నుంచి పాతాళానికి పడిపోయారని అంటారు.
ఆతని సుఖాల కోసం ఆడవారిని ఆటవస్తువులుగా వాడుకుని వదిలేస్తాడన్న మచ్చ ఉంది.అతని గురించి తెలియక అతని ఉచ్చులో పడిన వాళ్ళలో అలనాటి నటి నిర్మల ఒకరు.
నిర్మల అంటే ఈ తరానికి తెలియకపోవచ్చు.శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి తల్లిగా నటించారు.ఆమె తెలుగులోనే కాకుండా, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో కూడా నటించారు.
1965 లో వెన్నిర ఆడై అనే తమిళ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిర్మల, మొదటిసినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ సినిమాతోనే ఆమె వెన్నిర ఆడై నిర్మలగా మారిపోయారు.1967 లో భక్తప్రహ్లాద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన నిర్మల, ఆ తర్వాత అవేకళ్లు, బంగారుతల్లి, బొమ్మ బొరుసా వంటి చిత్రాల్లో నటించారు.హీరోయిన్ గా వెలిగిన నిర్మల, ఆ తర్వాత నాగార్జున, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ వంటి హీరోలకు తల్లిగా కూడా నటించి మెప్పించారు.కలిసుందాంరా, జయంమనదేరా, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, సీమసింహం వంటి అనేక చిత్రాల్లో నటించారు.
ఆమె తమిళంలో రెండు వందల సినిమాల్లో నటించారు.మలయాళంలో 52 సినిమాల్లో నటించారు.
అక్కడ ఉషాకుమారిగా వెండితెరకి పరిచయం అయ్యారు.సినిమాల్లోనే కాకుండా, పలు టీవి సీరియల్స్ లో కూడా ఆమె నటించారు.
భరతనాట్యం నేర్చుకుని ప్రొఫెషనల్ డాన్సర్ గా పేరు కూడా తెచ్చుకున్నారు.
అయితే నిర్మల కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఎంజిఆర్ ఆమెపై కన్ను వేశాడు.ఎలాగైనా ఆమెను తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడు.ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యి, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
అది నిజమని నమ్మిన నిర్మల అతని ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ప్రేమ పేరుతో ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు ఎంజిఆర్.
కాబోయే భర్తే కదా అని ఆమె కూడా తన సర్వస్వం అర్పించారు.కట్ చేస్తే అలా ఆమెని వాడుకుని, మోజు తీరాక పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు.
దీంతో ఆమె మానసికంగా క్రుంగిపోయారు. మగవాళ్ళ మీద అసహ్యం పెంచుకున్నారు.
ఇక ఎప్పటికీ మగవారిని నమ్మకూడదని, పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయారు.ఇలా ఎంజిఆర్ మాయలో పడి నలిగిపోయిన నటీమణులు చాలా మంది ఉన్నారు.తమిళనాట రాజకీయాల్లో చక్రం తిప్పిన జయలలిత కూడా ఇతగాడి మాయలో పడ్డారంటే అర్దం చేసుకోవచ్చు, అత(ఆట)గాడు బిగించిన ఉచ్చు ఎంత కఠినమైనదో అని.పైకి ఎలా ఉన్నా కూడా ఆడవాళ్ళు లోపల చాలా సున్నితంగా ఉంటారు.రాజకీయ నాయకురాలు అయినా, సినిమా హీరోయిన్ అయినా, మరెవరైనా గాని ఎవరేం చెప్పినా నమ్మేస్తుంటారు, నమ్మి మోసపోతుంటారు.అందుకే ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.ప్రేమ పేరు చెప్పి పెళ్ళికి ముందే లొల్లి చేసే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.