జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కేశరావు, మంత్రి గంగుల

రాజన్న సిరిసిల్ల జిల్లా: బిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందని, మల్లు బిఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఆదివారం పార్టీ సెక్రెటరీ జనరల్ కేశవరావు, మంత్రి గంగుల కమలాకర్ లతో కలిసి జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

 Minister Ktr Inagurates Brs Party Office In Rajanna Sircilla, Minister Ktr ,brs-TeluguStop.com

అనంతరం పార్టీ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 4 అమెరికా నుంచి తిరిగి వచ్చిన క్రమంలో 155 సంవత్సరాలు కాంగ్రెస్ కు బిల్డింగ్ లేదని, మన పార్టీకి బిల్డింగ్ అవసరమా అని పార్టీ అధినేతతో అన్నానని అన్నారు.మద్దతు కావాలని కొండ లక్ష్మణ్ బాపూజీని అడిగితే జలదృశ్యం ప్రాంతంలో తన స్థలం ఇచ్చారన్నారు.

అప్పటి ముఖ్యమంత్రి ఆ స్థలం మీద లేని పంచాయితీ పెట్టీ వెళ్లగొట్టిండ్రని గుర్తుచేశారు.వ్యక్తులు శాశ్వతం కాదు వ్యవస్థ శాశ్వతమని, అందుకే బంజారాహిల్స్ లో పెద్దగా పార్టీ ఆఫీసు కట్టుకున్నామని, 2006లో గొప్పవాళ్ళుతో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించు కున్నామన్నారు.

సిరిసిల్ల పార్టీ ఆఫీసు రాష్ట్రంలో ఎక్కడ లేదని అందరూ అంటున్నారని, తెలంగాణ కోసం చెమట,రక్తం, ధారపోసిన కార్యకర్తలది పార్టీ ఆఫీసు అన్నారు.గులాబి జెండా పేదల జెండా అని,నిత్య కల్యాణం పచ్చ తోరణంగా పార్టీ భవనం నిత్యం కళకళలాడలన్నారు.

కార్యకర్తల ఇంట్లో శుభకార్యాలకు పార్టీ హాల్ తక్కువ కర్చుకు ఇవ్వాలని, ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడే కెసిఆర్ చెక్కు తీసుకోవాలన్నారు.అనాదలకు పూర్తి భాధ్యత తీసుకొని పెళ్ళిళ్ళు చేయాలని, కులాంతర వివాహలు కూడా చేయాలన్నారు.

ఎప్పుడు సిరిసిల్లకు పార్టీకి ఆఫీసుకి వచ్చి చాయ్ తాగి పోవాలేని, నేను కూడా ఎప్పుడు వచ్చిన పార్టీ ఆఫీసుకు వస్తానని, నాకు కూడా ఆఫీసులో జాగా ఇవ్వాలని కోరారు.ప్రజావాణి కి వచ్చేవారు ఇక్కడ కూడా వినతులు ఇస్తారని, ఎప్పుడు అందుబాటులో ఉండేలా పదిమంది మంచి ఉద్యోగులను పెట్టాలని సూచించారు.

ప్రతి నియోజక వర్గ స్థాయిలో పార్టీ ఆఫీసు కట్టుకుందామని, పార్టీ ఆఫీసులు తెలంగాణ ఆత్తగౌరవానికి ప్రతీకగా నిలవాలన్నారు.నియోజక వర్గ సమావేశాలు పార్టీ కార్యాలయంలో పెట్టుకోవాలన్నారు.

పార్టీలో సమస్యలన్నీ తెళ్ళంగి వాళ్ళతో వస్తున్నాయని, మ్యానిఫెస్టో వచ్చినంక కాంగ్రెస్ వాళ్లు దుప్పటి కప్పుకొని పడుకున్నరన్నారు.బిఆర్ఎస్ పథకాలను కాఫీ కొట్టింది కాంగ్రెస్ పార్టీనేనని, ప్రధాని నరేంద్ర మోడీ కూడా మన పథకాలను కాఫీ కొట్టిండన్నారు.రుణమాఫీ దఫలవారిగా జరుగుతుందని, రెండుసార్లు రుణమాఫీ చేసిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు.2028 ఎన్నికల వరకు ఐదువేలు రూపాయల ఆసరా ఫించన్ ఇస్తామన్నారు.కెసిఆర్ భీమ ప్రతి ఇంటికి ధీమా 93 లక్షల కుటుంబాలకు ఇన్సూరెన్స్ చేస్తామని, తెలంగాణ దేశానికే అన్నపెట్టే అన్నపూర్ణ అయ్యిందని, అన్నపూర్ణ పథకంతో ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇవ్వబోతున్నామన్నారు.సిలిండర్ మొక్కి బిజెపి డిపాజిట్ దక్కకుండా చేయాలని, 400 కే బిఆర్ఎస్ ప్రభుత్వం సిలిండర్ ఇస్తుందన్నారు.

సౌభాగ్య లక్ష్మి ద్వారా అర్హులైన మహిళలకు మూడు వెలు ఇస్తామన్నారు.

కెసిఆర్ ఆరోగ్యరక్షాతో 15 లక్షల వరకు ఉచిత వైద్యం అందింస్తామన్నారు.45 రోజులు మీరు మా కోసం పనిచేస్తే రాబోయే 5 ఎండ్లు మీ కోసం పనిచేస్తామని చెప్పారు.సిరిసిల్ల లో తనను కూడా గెలిపించుకోవాలి విజ్ఞప్తి చేశారు.

కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని, 95 నియోజక వర్గాల్లో గెలిస్తెనే ముఖం తెలివి ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో రాష్త్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్, జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్, ఎంఎల్సి రమణ, శాసనసభ్యులు, సుంకే రవిశంకర్, రసమయి బాలకిషన్, వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మి నర్సింహారావు, బి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, మున్సిపల్ చైర్మన్లు జిందం కళ, రామతీర్థం మాధవి, బిఆర్ఎస్ నేతలు, వివిధ గ్రామాల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube