ఒక్క సిసి కెమెరా వందమంది పోలీసుల నిఘాతో సమానం

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఒక్క సిసి కెమెరా వందమంది పోలీసుల నిఘాతో సమానమని నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతోగానో ఉపయోగపడుతున్నాయని ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి, ఎంపిపి పిల్లి రేణుక కిషన్, జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు లు అన్నారు.ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శనివారం ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, ఎంపీపీ పిల్లీ రేణుక కిషన్, జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు, సర్పంచ్ ముక్క శంకర్ లు కలిసి ప్రారంభించారు.

 One Cc Camera Is Equal To The Surveillance Of 100 Policemen, Cc Cameras Rajanna-TeluguStop.com

ఈ సందర్భంగా సిఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ఎంత మంది పోలీసు లు ఉన్నా కొందరు కండ్లుగప్పి తప్పించునే అవకాశం ఉంటుంది.

కానీ సీసీ కెమెరాల నిఘా నుంచి తప్పించుకోలేరన్నారు.

దీంతో దొంగతనాలు తగ్గుముఖం పట్టాయన్నారు.రాజన్నపేట గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించి పలువురికి ఆదర్శంగా నిలిచిన గ్రామ సర్పంచు పాలకవర్గానికి గ్రామ ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు.ఎల్లారెడ్డిపేట సర్కిల్ పరిధిలో ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో కెమెరాలను ఏర్పాటు చేయిస్తామని అన్నారు.

నేరాలు, దొంగతనాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాల పాత్రను తెలియజేస్తున్నామన్నారు.

ప్రజాప్రతినిధులు, దాతలు, గ్రామాభివృద్ధి కమిటీల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు.

ఈసందర్భంగా ఎంపిపి పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిందని.ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వంటి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని.

ప్రజల సహకారంతో నేరాలను అదుపు చేసేందుకు కృషి చేస్తుందన్నారు.ఇందుకోసం నూతన టెక్నాలజీని సైతం వినియోగిస్తున్నదని ఇందులో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సిఐ ఎస్ఐ లను వారు కోరారు.

ప్రజాప్రతినిధులు, దాతలు, గ్రామాభివృద్ధి కమిటీల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తమ సహాకారం ఉంటుందన్నారు వ్యాపార, వాణిజ్య సముదాయాల్లోనూ యజమానులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

రాజన్నపేట గ్రామ ప్రజలు ఏర్పాటు చేసుకున్నట్లు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను గ్రామ ప్రజలు ఏర్పాటు చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ ఐ రమాకాంత్ , ఎంపిటీసీ ధరవత్ రజిత, ఉప సర్పంచ్ కల్లూరి వెంకట రమణారెడ్డి , సీనియర్ నాయకులు అందే సుభాష్ , గ్రామ కార్యదర్శి రవి , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , గ్రామ శాఖ అధ్యక్షులు స్వామి , వార్డు సభ్యులు చల్ల సుధాకర్ రెడ్డి , భూమయ్య , లతా, నమలిగొండ జగన్, ఉమేష్ , గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు,

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube