రాజన్న సిరిసిల్ల జిల్లా: సీతారాముల కల్యాణానికి సిరిసిల్ల సీతమ్మ కళ్యాణం చీర ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇస్తున్న వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతమైన చీరను చేనేత మగ్గంపై సీత రాముల కళ్యాణం వచ్చే విధంగా అంతేకాకుండా అంచులు భద్రాద్రి దేవాయాయంలో ఉన్నటువంటి సీతారాముల ప్రతిరూపాలు అంచులు వచ్చే విధంగా చీర మొత్తం శంకు చక్ర నామాలు చిరపై బార్డర్లో జైశ్రీరామ్ అంటూ వచ్చే విధంగా ఆరు రోజుల పాటు శ్రమించి
ఈ చీరను చేనేత మగ్గంపై నేశాడు ఈ చీర యొక్క బరువు 800 గ్రాములు ఉంటుంది.ఇందులో రెండు గ్రాముల బంగారం 150 గ్రాముల వెండి పట్టు దారాలతో వేశాడు చీర కొంగులో సీతారాముల కళ్యాణం బొమ్మనియడం విశేషం దీన్ని దేవాదాయ శాఖ మంత్రి చూపించి సీతారాముల కల్యాణానికి అందిస్తాను అందించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.