రాజన్న సిరిసిల్ల జిల్లా: హైదరాబాద్, గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో ఓపెన్ ఫ్లాట్స్ తక్కువ ధరకి ఇప్పిస్తానని అమాయక ప్రజల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసులు చేసి వారికి రిజిస్ట్రేషన్ చేయకుండా బేదిరింపులకు పాల్పడిన మేరుగు బాబు ని కొనరావుపేట్ పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు డిఎస్పీ నాగేంద్రచారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ….
హైదరాబాద్, గజ్వేల్ పరిసర ప్రాంతాలలో తక్కువ ధరకే ఓపెన్ ప్లాట్స్ ఇప్పిస్తానని, ఉద్దేశ్యపూర్వకంగా అమాయకుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఏ విధమైన రిజిస్ట్రేషన్ చేయకుండా, వారి డబ్బులు తిరిగి చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తూ,
ఆ విషయమై అడగడానికి వెళ్లిన బాధితులపై దాడికి ప్రయత్నించిన విషయమై కొనరావుపేట మండలానికి చెందిన మామిడిపల్లి గ్రామానికి చెందిన సాసాల పద్మ, రామన్నపేట గ్రామానికి చెందిన చెర్ల భూదవ్వ ల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి, సదరు నేరాలకు పాల్పడుతున్న కొలనూర్ గ్రామానికి చెందిన మేరుగు బాబు ను అదుపులోకి తీసుకొని విచారించగా, తను చేసిన నేరాలను ఒప్పుకొని, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు వ్యక్తుల నుండి, హైదరాబాద్, గజ్వేల్ ప్రాంతాల్లో తక్కువ ధరకు ఓపెన్ ప్లాట్స్ ఇప్పిస్తానని,
అతి తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు అర్జిoచవచ్చని నమ్మించి, వారి దగ్గర నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసి, తన స్వంత అవసరాలకు అట్టి డబ్బులను వాడుకొని, భాదితులకు రకరకాల కారణాలు చెప్తూ రిజిస్ట్రేషన్ వాయిదా వేసేవాడినని, ఎవరైనా డబ్బు బలవంతం చేస్తే చంపివేస్తనని బెదిరించేవాడినని తను చేసిన నేరం ఒప్పుకోవడంతో, అతడిని కోర్టు నందు ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలిoచడం జరిగిందని డిఎస్పీ తెలిపారు.







