అత్యాధునిక టెక్నాలజీ సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా పోయినటువంటి ఫోన్ బాధితునికి అప్పగించిన జిల్లా ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా: దొంగతననికి లేదా పోయిన మొబైల్ ని తిరిగి పొందడానికి సీఈఐఆర్ అప్లికేషన్ ఎంతో దోహదపడుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అత్యాధునిక టెక్నాలజీ సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా పోయినటువంటి ఫోన్ బాధితునికి అప్పగించడం జరిగింది.

 The District Sp Handed Over The Lost Phone To The Victim Through The State-of-th-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దొంగతననికి లేదా ఫోన్ లను వెతికి పెట్టడానికి కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ సిఈఐఆర్ (సెంట్రల్ ఏక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ) అనే అప్లికేషన్ ద్వారా ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్న లేదా చోరికి గురైనా అట్టి ఫోన్ లను వెతికి పట్టుకోవడానికి ఎంతో చేయూతనిస్తుందని అన్నారు.

మొబైల్ ఫోన్ పోతే సంబదిత పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని సూచించారు.

అదే విదంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా ఐఎంఈఐ నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని తద్వారా అట్టి ఫోన్ ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు.కోనరావుపేట్ మండలం వెంకట్రావుపెట్ గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి తేదీ 16-05-2022 రోజున కొనరావుపేట్ నుండి గూడెం గ్రామానికి వెళ్తుండగా దారి మధ్యలో మొబైల్ పోవడం జరిగింది.

సదరు వ్యక్తి కోనరావుపేట్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫిర్యాదు చేయడం జరిగింది.నూతన టెక్నాలజీ అయినా సిఈఐఆర్ ని ఉపయోగించి అయొక్క మొబైల్ కామారెడ్డి జిల్లా బీబీపెట్ మండలం యాడారం గ్రామంలో ఉన్నదని గుర్తించిన పోలీసులు ఫోన్ ని స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తి అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి,సి.ఐ కిరణ్, ఎస్.ఐ రమాకాంత్,ఐటీ కోర్ ఎస్.ఐ కిరణ్ కుమార్ సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube