సింగసముద్రం సాగునీటి సమస్యను పరిశీలించిన మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సాగునీటి వరప్రదాయిని అయిన సింగ సముద్రం నుండి ఎల్లారెడ్డి పేట గ్రామ పొలాలకు సాగునీరు వచ్చే క్రమంలో కోరుట్లపేట గ్రామ శివారు లో గల కొరుట్లపెట పంపుల వద్ద నుండి ఎల్లారెడ్డి పేట కు సాగునీరు రాకుండా తరచూ అక్కడి కోరుట్ల పేట, బొప్పపూర్ రైతులు పెద్దపెద్ద బండ రాళ్ళు అడ్డు పెడుతున్నారని సముద్ర నీరటి లు బాధ రాజు,రేసు రాజయ్య లు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ దృష్టికి తీసుకు వెళ్లగా కోరుట్ల పేట పంపుల వద్ద కు వెళ్లి ఆయన పరిశీలించారు.కోరుట్ల పేట విఆర్ఏ చొక్కం నారాయణ ను మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ పిలిచి ఎల్లారెడ్డి పేట గ్రామానికి న్యాయబద్దంగా రావాల్సిన సాగు నీరు అపవద్దని ఏదైనా సాగు నీరు సమస్య ఉంటే పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు.

 Balaraju Yadav, A Former Mptc Who Looked Into The Singasamudram Irrigation Issue-TeluguStop.com

వెంటనే మండల తహశీల్దార్ జయంత్ కుమార్ కు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఫోన్ లో మాట్లాడి ఇరు గ్రామాల మధ్య నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని తహశీల్దార్ జయంత్ కుమార్ ను కోరగా బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కరిస్తానని మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ తో ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube