గన్ మెన్లను సరెండర్ చేసిన మాజీమంత్రి బాలినేని..!

గన్ మెన్లను సరెండర్ చేస్తూ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి మాజీ మంత్రి బాలనేని శ్రీనివాస్ రెడ్డి లేఖ రాశారు.ఒంగోలు నకిలీ దస్తావేజుల కుంభకోణంలో పోలీసుల తీరుపై ఆయన నిరసన వ్యక్తం చేశారు.

 Ex-minister Balineni Who Surrendered The Gun Men..!-TeluguStop.com

నకిలీ దస్తావేజుల స్కాంలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడం లేదని బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.పోలీసులు తన మాటను పెడచెవిన పెట్టారన్న బాలినేని అసలు దోషులను వదిలేస్తున్నారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే గన్ మెన్ లను తక్షణం సరెండర్ చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.కాగా కుంభకోణం కేసులో ఇప్పటివరకు పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తూ భూములను కబ్జా చేస్తున్న ముఠాను గుట్టు రట్టు కాగా ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ డీల్ చేస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube