వేములవాడ పట్టణంలో ప్రగతిలో ఉన్న పనుల్లో వేగం పెంచాలి.. కలెక్టర్ అనురాగ్ జయంతి

వేములవాడ పట్టణంలో ప్రగతిలో ఉన్న పనుల్లో వేగం పెంచాలి నంది కమాన్, మూలవాగు బండ్, గుడి చెరువు మినీ ట్యాంక్ బండ్ లను సుందరంగా తీర్చిదిద్దాలి పాఠకుల సౌకర్యార్థం త్వరలోనే అందుబాటులోకి నూతన గ్రంధాలయం”మోడల్ పాఠశాలలు” గా వేములవాడ ఎంపీపీఎస్, జెడ్పీహెచ్ఎస్ (బాలికలు)పాఠశాలలు వేములవాడ క్షేత్ర పర్యటనలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలో ప్రగతిలో ఉన్న పనుల్లో వేగం పెంచి, పట్టణ ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం ఆయన వేములవాడ పట్టణంలో మున్సిపల్, రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో కలిసి పట్టణంలో ప్రగతిలో ఉన్న పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

 In The Progress Of Vemulawada Town, The Speed Should Be Increased.. Collector An-TeluguStop.com

మొదటగా నంది కమాన్ జంక్షన్ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు.

ఒక కోటి రూపాయలతో ఏర్పాటు చేస్తున్న గోపురం పనులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.75 లక్షల రూపాయలతో చేపడుతున్న డివైడర్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, గ్రీనరీ సుందరీకరణ పనులను త్వరగా ప్రారంభించి, మే నెలాఖర్లోగా పూర్తి చేయాలని అన్నారు.అనంతరం 1 కోటి 98 లక్షల రూపాయలతో చేపడుతున్న మూలవాగు బండ్ సుందరీకరణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

పట్టణ ప్రజలు వాకింగ్ చేయడానికి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు వీలుగా బ్రిడ్జి నుండి వైకుంఠధామం వైపు 330 మీటర్ల మేర నిర్మిస్తున్న బండ్ సుందరీకరణ పనులను ఈ నెలాఖర్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.తదనంతరం శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం నుండి జగిత్యాల బస్టాండ్ వరకు, తెలంగాణ తల్లి చౌరస్తా నుండి కోరుట్ల బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని రహదారులు, భవనాల శాఖ అధికారులను ఆదేశించారు.

డ్రైనేజీ లు కూడా నిర్మించాలని దీనికోసం 9 కోట్ల 50 లక్షలు రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు.

అనంతరం వేములవాడ గుడి చెరువు మిని ట్యాంక్ బండ్ ను పరిశీలించి, సుందరీకరణ, అభివృద్ధి పనుల గురించి ఇరిగేషన్, టూరిజం అధికారులతో కలెక్టర్ చర్చించారు.

సుమారు 13 కోట్ల రూపాయలతో ఇరిగేషన్, టూరిజం శాఖలు సంయుక్తంగా ఈ బండ్ ను అభివృద్ధి చేస్తాయని పేర్కొన్నారు.ఒకవైపు 800 మీటర్ల మేర 45 మీటర్ల వెడల్పుతో, మరొకవైపు 600 మీటర్ల మేర 30 మీటర్ల వెడల్పుతో బండ్ నిర్మాణం చేయనున్నట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు.

త్వరగా పనులు ప్రారంభించి, జూన్ 2 వ తేదీలోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.మొదటగా ఇరిగేషన్ అధికారులు స్నానఘట్టాలు నిర్మించిన అనంతరం టూరిజం అధికారులు సుందరీకరణ పనులు చేపట్టనున్నారు.

తదనంతరం కలెక్టర్ తహశీల్దార్ కార్యాలయ సమీపంలో పాఠకుల కోసం నిర్మిస్తున్న గ్రంథాలయం పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.సుమారు 1 కోటి 45 లక్షల రూపాయలతో చేపడుతున్న ఈ గ్రంథాలయ భవన నిర్మాణ పనులను జూన్ 2 వ తేదీలోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం మన బస్తీ – మన బడి కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 29 లక్షల రూపాయలతో, జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 79 లక్షల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు.

ప్లే గ్రౌండ్, ప్లే ఐటమ్స్, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, అదనపు తరగతి గదులు, విద్యార్థుల కోసం అన్ని మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించి పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆదేశించారు.చివరగా 94 లక్షల రూపాయలతో కోరుట్ల బస్టాండ్ నుండి మల్లారం జంక్షన్ వరకు, 1 కోటి 43 లక్షల రూపాయలతో కోరుట్ల బస్టాండ్ నుండి భీమేశ్వర గార్డెన్స్ వరకు చేపడుతున్న ఫుట్ పాత్ పనులను కలెక్టర్ పరిశీలించారు.

సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ క్షేత్ర పర్యటనలో కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఈఈ అమరేందర్ రెడ్డి, పంచాయితీ రాజ్ ఈఈ సూర్యప్రకాశ్, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, మున్సిపల్ కమీషనర్ అన్వేష్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సారీ, తహశీల్దార్ రాజు, తదితరులు ఉన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube