రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం( Raja Rajeshwara Swami Temple, )లో తిరుమల తిరుపతి దేవస్థానం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను గురువారం రాత్రి 8 గంటలకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు.వేములవాడ ఆలయంలో అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రికి ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్వాగతం పలికారు.

 State Bc Transport Minister Ponnam Prabhakar Presented Silk Cloths To Rajarajesw-TeluguStop.com

ఈ సందర్బంగా ఆలయ అర్చకులు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు స్వాగతం పలికారు.అనంతరం మంత్రి, ప్రభుత్వ విప్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, వారికి ఆలయ అర్చకులు ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar ) మాట్లాడుతూ వేములవాడ రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా అధికారులతో కలిసి సమర్పించడం జరిగిందని, అందరూ బాగుండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థించామని అన్నారు.మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడలో స్వయంగా ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు తీసుకొని రావాల్సి ఉందని కొన్ని అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి రాలేకపోయారని, ఎన్నికల కోడ్( Election Code ) రాకపోతే ప్రస్తుత వారంలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) వేములవాడ ఆలయాన్ని సందర్శిస్తారని మంత్రి తెలిపారు.

రాజన్న భక్తులుగా తాము వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో పలు దఫాలు చర్చించామని, మాటలకే పరిమితం కాకుండా వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ రాజరాజేశ్వర స్వామిని కోరుకున్నామని అన్నారు.

మహాశివరాత్రి జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశామని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జిల్లా అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారని, మహాశివరాత్రి సందర్భంగా భక్తులు వచ్చి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులు కావాలని కొరుతూ మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్( Aadi Srinivas ) మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ ఆలయం ప్రాంగణంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయని, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలకుండా బీసీ రవాణా శాఖ మంత్రి ప్రత్యేకంగా పరివేక్షిస్తున్నారని అన్నారు.మహాశివరాత్రి( Maha Shivratri ) జాతరకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం పరిశుభ్రతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు విభాగాలలో పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బంది సమన్వయంతో మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు చేశారని అన్నారు.

సకాలంలో మంచి వర్షాలు కురిసి పాడిపంటలతో ప్రజలంతా వృద్ధులకు రావాలని స్వామివారిని కోరినట్లు ఆయన తెలిపారు.తెలంగాణ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube