Hair Fall Tonic : ఒక్కసారి తలకు దీన్ని రాశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు.. తెలుసా?

స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దాదాపు ప్రతి ఒక్కరిలోనూ హెయిర్ ఫాల్( Hair fall ) అనేది ఉంటుంది.నిత్యం ఎంతో కొంత జుట్టు ఊడుతూనే ఉంటుంది.

 Try This Homemade Tonic To Stop Hair Fall Immediately-TeluguStop.com

అయితే కొందరిలో జుట్టు రాలడం అనేది చాలా అధికంగా ఉంటుంది.ఇలాంటి వారు తెగ హైరానా పడిపోతుంటారు.

హెయిర్ ఫాల్ ను ఎలాగైనా వదిలించుకోవాలని తాపత్రయపడుతుంటారు.అయితే ఇందుకోసం మీరు వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

నిజానికి జుట్టు రాలడాన్ని అరికట్టే ఔషధ గుణాలు మన వంటింట్లోనే ఉన్నాయి.వాటిని సద్వినియోగం చేసుకుంటే సులభంగా హెయిర్ ఫాల్ కు బై బై చెప్పవచ్చు.

Telugu Care, Care Tips, Fall, Tonic, Healthy, Homemade Tonic, Latest, Thick-Telu

ఇప్పుడు చెప్పబోయే హెయిర్ టానిక్‌ కూడా ఆ కోవ‌కే చెందుతుంది.వారానికి ఒక్కసారి ఈ టానిక్ ను తలకు రాశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక ఉల్లిపాయ( onion )ను తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Tonic, Healthy, Homemade Tonic, Latest, Thick-Telu

అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు బియ్యం, రెండు బిర్యానీ ఆకులు( Bay leaf ) వేసుకోవాలి.వీటిని దాదాపు 15 నిమిషాల పాటు వాటర్ లో ఉడికించాలి.దీంతో వాటర్ కలర్ చేంజ్ అవుతుంది.

అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్టైనర్ సహాయంతో మరిగించిన నీటిని ఫిల్టర్ చేసుకోవాలి.ఈ నీటిలో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేశారంటే మన హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.

ఒక స్ప్రే బాటిల్ లో ఈ హెయిర్ టానిక్ ను నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి స్ప్రే చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయాలి.

వారానికి ఒకసారి ఈ విధంగా చేశారంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.ఇప్పుడు చెప్పుకున్న న్యాచుర‌ల్‌ టానిక్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది.

జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడుతుంది.కాబట్టి హెయిర్ ఫాల్ తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ మేడ్ టానిక్ ను ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube