జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సన్నద్ధం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 3 వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వేదికగా సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.

 Everything Is Ready For The Counting Of Assembly Election Votes In Siricilla Dis-TeluguStop.com

ఈనెల 3న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.అదే రోజు సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.

ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఏర్పాట్లు పూర్తి.సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాలకు అదే పాఠశాలలో వేరు వేరు కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఒక్కో నియోజకవర్గంలో 14+1 చొప్పున టేబుళ్లు ఏర్పాట్లు చేశారు.లెక్కింపులో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు లెక్కించనున్నారు.పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కు 3 టేబుల్ లను ఏర్పాటు చేసి ఒకే రౌండ్ లో లెక్కింపు పూర్తి చేస్తారు.

సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం కు 4 టేబుల్ లను ఏర్పాటు చేసి ఒకే రౌండ్ లో లెక్కింపు పూర్తి చేస్తారు.ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ హాలులో 14 టేబుల్ లను ఏర్పాటు చేయనున్నారు.

ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఒక బృందంగా విధులు నిర్వహిస్తారు.సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 21 రౌండ్లు, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 19 రౌండ్ల లో ఈవీఎంలలో నీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తారు.

ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రత.

తంగల్లపల్లి మండలం బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద స్థానిక పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వ్, కేంద్ర బలగాలతో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్నవారికే స్ట్రాంగ్ రూమ్స్ లోకి అనుమతి ఇస్తున్నారు.స్ట్రాంగ్ రూం ల వద్ద 24 * 7 పటిష్ట నిఘా , భద్రతను ఏర్పాటు చేశారు.

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పి.లెక్కింపు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ లు శనివారం సాయంత్రం పరిశీలించారు.

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలన్నారు.ఎస్పి అఖిల్ మహాజన్ పోలీస్ అధికారుల తో భద్రతా ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube