రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మారూపాక గ్రామ పంచాయితీ పరిధిలోనీ అక్రమ వెంచర్ ల పై గ్రామ పంచాయితీ పాలక వర్గం కఠిన చర్యలు తీసుకుంటుంది.అనుమతి లేని వెంచర్ ల పై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామ పంచాయితీ సెక్రటరీ శ్రీనివాస్ హెచ్చరించారు.3 రోజుల క్రితం అనుమతి లేని అన్ని వెంచర్ లలో ట్రాక్టర్ తో చదును చేసిన అధికారులు , బుదవారం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.
వెంచర్ డెవలపర్ లు పంచాయితీ రాజ్ చట్టానికి అనుగుణంగా , నియమ నిబంధనలు అనుసరించి వెంచర్ లు ఏర్పాటు చేసుకోవాలని, లేదంటే పై అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని కార్యదర్శి నాయినీ శ్రీనివాస్ హెచ్చరించారు.
ప్లాట్ లు కొనేవారు కూడా జాగ్రత్త వహించాలని, పూర్తి సమాచారం కోసం మారుపాక గ్రామ పంచాయితీ కార్యాలయం లో సంప్రదించాలని అయన కోరారు.