దగ్గు.దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు.మనిషిని పిల్చి పిప్పి చేసేసే దగ్గు.ఒక్క సారి పట్టుకుందంటే అస్సలు వదిలి పెట్టదు.అందుకే దగ్గు పేరు చెబితేనే భయపడుతుంటారు.ఆస్తమా, ధూమపానం, అలర్టీ, ఊపిరితిత్తుల్లో సమస్యలు ఇలా రకరకాల కారణాల వల్ల దగ్గు వేధిస్తూ ఉంటుంది.
దాంతో దగ్గును నివారించుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు.అయితే దగ్గు సమర్థవంతంగా తగ్గించడంలో పటిక బెల్లం అద్భుతంగా సహాయపడుతుంది.

ఆరోగ్యానికి పటిక బెల్లం ఎంతో మేలు చేస్తుంది.విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్ ఇలా ఎన్నో పోషకాలు పటిక బెల్లంలో ఉంటాయి.అందుకే పంచదారకు బదులుగా పటిక బెల్లంను వాడమని చెబుతుంటారు.పటిక బెల్లంతో ఎన్నో జబ్బులను కూడా నివారించుకోవచ్చు.ముఖ్యంగా దగ్గు సమస్యతో బాధ పడే వారు.ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో కొద్దిగా పటిక బెల్లంను పొడి మరియు మిరియాల పొడి వేసి బాగా కలిపి.
సేవించాలి.ఇలా రోజుకు ఒకటి లేదా రెండు సార్లు చేస్తే దగ్గు క్రమంగా తగ్గు ముఖం పడుతుంది.
అలాగే రెండు స్పూన్ల పుదీనా ఆకుల రసంలో కొద్దిగా పటిక బెల్లం పొడి కలిపి తీసుకోవాలి.ఇలా ఉదయం, సాయం చేస్తే.దగ్గు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.లేదా చిన్న పటిక బెల్లం ముక్కను మెల్ల మెల్లగా చప్పరిస్తూ ఉన్నా దగ్గు సమస్య దూరం అవుతుంది.

ఇక గొంతు నొప్పిని నివారించడంలోనూ పటిక బెల్లం ఉపయోగపడుతుంది.ఒక బౌల్ తీసుకుని అందులో అర స్పూన్ పటిక బెల్లం పొడి, పావు స్పూన్ మిరియాల పొడి మరియు కొద్దిగా నెయ్యి కలిపి ఉండలా చేసుకుని తీసుకోవాలి.ఇలా చేస్తే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.