ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు మార్పు చేస్తే క్రిమినల్ చర్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత నెల రోజుల వ్యవధిలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధిక శబ్ధం చేసే 86 ద్విచక్ర వాహన సైలెన్సర్లను గుర్తించి , మరోమారు వినియోగించకుండా రోడ్ రోలర్ సాయంతో మంగళవార సిరిసిల్ల బై పాస్ ప్రాంతంలో ధ్వంసం చేసారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమని, శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజాఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకోని అధికంగా శబ్దం చేసే ద్విచక్రవాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వ్యాప్తంగా తనీఖీలు చేపట్టడం జరిగిందన్నారు.

 Modification Of Silencers To Two-wheelers Criminal Action, Modification Of Silen-TeluguStop.com

ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు తెలియజేయునది కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించుకోవాలి,

ఎవరైన వాహనదారుడు సైలెన్సర్ మార్పు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నా వాహనాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.వాహనాలకు సైలెన్సర్ మార్పు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నా వారి సమాచారం సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్.ఐ 8712656441 , వేములవాడ ట్రాఫిక్ ఎస్.ఐ 8712656440 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు.జిల్లాలో నిబంధనలు విరుద్ధంగా వాహనాలకు సైరన్లు బిగిస్తే వాహనాలు సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ సైరన్లు బిగించిన 05 వాహనాలపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయడం జరిగిందన్నారు.ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ రఘుపతి, ట్రాఫిక్ ఎస్.ఐ రమేష్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube