రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla )లోని తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్వాస్) సర్టిఫికెట్ వచ్చింది.ఆమేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కు గురువారం ధ్రువపత్రo అందింది.
గతంలో జిల్లాలో వేములవాడ, తంగళ్ళ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్వాస్) సర్టిఫికెట్ రాగా ఇటీవలే పీఎస్ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు కోనారావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు కూడ ఎన్‌క్వాస్ గుర్తింపు దక్కింది.జిల్లాలో వైద్య ప్రమాణాలు మెరుగయ్యాయని చెప్పడానికి మరో నిదర్శనమిది.
నేషనల్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్సీ)( NHSRC ) నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను చేరుకొంటే ఎన్‌క్వాస్ సర్టిఫికెట్ వస్తుంది.దీనికి మూడేండ్ల వ్యాలిడిటీ ఉంటుంది.మంత్రి కే తారక రామారావు ప్రత్యేక చొరవతో ఈ సర్టిఫికేట్ జిల్లాలోనీ ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యమైన వైద్యం అందుతుంది అనేందుకు నిదర్శనం- జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanthi ) తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్వాస్) సర్టిఫికెట్( National Quality Assurance Standards ) రావడంపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హర్షం వ్యక్తం చేశారు.జిల్లా ప్రజలకు పీహెచ్‌సీ స్థాయి నుంచే నాణ్యమైన వైద్యం అందుతున్నదని చెప్పడానికి కేంద్రం ఇచ్చిన ఈ గుర్తింపు ఒక నిదర్శనమని అన్నారు.
ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.
మంత్రి కే తారక రామారావు( Minister KTR ) ప్రత్యేక చొరవతో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు పెరిగాయని, విలువైన వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, ఓపీ, ఐపీ, సర్జికల్ ఇలా అన్ని విభాగాల్లో నాణ్యత పెరిగిందన్నారు.
ఇటీవలే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఫిజియథెరపీ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చామని జిల్లా కలెక్టర్ తెలిపారు.