రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేద్దామని జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు అకునూరి శంకరయ్య పిలుపునిచ్చారు.హైదరాబాద్ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం సిరిసిల్ల పట్టణంలోనీ డా బి ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హల్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర పై ‘సంఘం శరణం గచ్చామి’ నాటక రూపకాన్ని ప్రదర్శించారు.

 Everyone Should Strive To Fulfill The Aspirations Of Dr Babasaheb Ambedkar, Dr-TeluguStop.com

అంతకు మునుపు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు అకునూరి శంకరయ్య, రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, దళిత సంఘాల నాయకులు, ప్రతినిధులుతదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ… అణగారిన వర్గాల పట్ల వివక్షను రూపుమాపాలనే ఉద్దేశంతో అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు.

అన్నివర్గాల అభ్యున్నతికోసం అంబేడ్కర్‌ చేసిన కృషిని నాటకరూపంలో ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు.సంఘం శరణం గచ్చామి నాటకం ద్వారా అంబేడ్కర్‌ జీవిత విశేషాలను కళాకారులు ప్రదర్శించారన్నారు.ప్రతి ఒక్కరూ ఈ నాటకాన్ని తిలకించి సమసమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు.

అంబేద్కర్‌ జీవితం అందరికి ఆదర్శం:రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్.రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ…ప్రపంచం గర్వించదగ్గ మహామేధావి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్‌ను సమాజంలోని ప్రతీ ఒక్కరు స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్ అన్నారు.గొప్ప మహనీయుడు అంబేద్కర్‌ జీవిత విశేషాలు, ఆశయాలు , లక్ష్యాలను నేటి తరానికి తెలియజేయడం కోసం ఈ నాటిక ను ప్రదర్శించడం జరుగుతుందన్నారు.

అంబేద్కర్‌ ఏ ఒక్కరి వాడో కాదని , అందరివాడని ఆయన ఆశయ సాదనకు ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అంబేద్కర్‌ సంఘాలు నాయకులు, ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు ఆకట్టుకున్న అంబేడ్కర్‌ జీవిత చరిత్ర  రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జీవిత చరిత్రపై సంఘం శరణం గచ్చామి పేరుతో ఏర్పాటు చేసిన నాటకం ప్రజలను, విద్యార్థులను ఆకట్టుకొంది.

సంఘం శరణం గచ్చామి నాటిక ప్రదర్శన హైదరాబాదు కు చెందిన అభ్యుదయ ఆర్ట్స్‌ అకాడమీ వారు ప్రదర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube