వేసవి కాలంలో అద్భుతమైన సుగంధ సబ్జా షర్బత్.. ఇంట్లోనే సులభంగా ఇలా..

చాలామంది వేసవికాలం( summer )లో వేడిని తట్టుకోలేక రకరకాల శీతల పానీయాలు తాగడానికి ఇష్టపడుతుంటారు.మరి ముఖ్యంగా చల్లగా ఉండే శీతల పానీయాలను తాగడానికి ఇష్టపడతారు.

 Deliciously Aromatic Sabja Sharbat In Summer Season Easy To Make At Home ,sabja-TeluguStop.com

అయితే వేసవికాలం సమయంలో ఎండలకు శీతల పానీయాలు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.ఇందులో చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది.

దీనివల్ల అనేక రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.అయితే వేసవికాలంలో ఎండను తట్టుకోవడం ఎలా అని అనుకుంటే మాత్రం.

ఇంట్లోనే చాలా సులువుగా శీతల పానీయాలకు బదులుగా షర్బత్( sharbat ) ను తయారు చేసుకొని తాగవచ్చు.అయితే వేసవికాలంలో ఎంతో ఉపయోగపడే సుగంధ సబ్జాల షర్బత్( sabja sharbat ) ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇది కేవలం ఆరోగ్యంగానే కాకుండా రుచికరంగా కూడా ఉంటుంది.అయితే ఇది చాలా రుచిగా, కలర్ ఫుల్ గా ఉంటుంది.కేవలం ఐదే ఐదు నిమిషాల్లో దీన్ని తయారు చేసుకొని తాగవచ్చు.దీని తాగడం వల్ల శరీరానికి ఎంతో చలువ చేస్తుంది.

వేడి నుండి ఉపశమనం పొందవచ్చు.ఎంతో రుచిగా, చల్ల చల్లగా ఉండే ఈ సుగంధ సబ్జా షర్బత్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముందుగా సుగంధ సబ్జా షర్బత్ తయారీకి కావాల్సిన పదార్థాలు:


సుగంధ రెండు టేబుల్ స్పూన్స్, సోడా ఒక గ్లాస్, నిమ్మకాయ ఒకటి, అరగంట పాటు నానబెట్టిన సబ్జా గింజలు రెండు టేబుల్ స్పూన్.

సుగంధ సబ్జా తయారీ విధానం:

ముందుగా ఒక గ్లాసులో సుగంధను వేసుకోవాలి.ఆ తర్వాత ఇందులో నిమ్మరసం వేసి బాగా కలపాలి.ఆ తర్వాత కాస్త సోడాను వేసి కలపాలి.ఇక ఆఖరిగా నానబెట్టిన సబ్జా గింజలను వేసి కలిపి ఒక గ్లాసులో సర్వ్ చేసుకొని తాగాలి.ఇలా చల్లచల్లని, రుచికరమైన సుగంధ సబ్జా షర్బత్ చక్కగా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకొని తాగవచ్చు.

దీన్ని తాగడం వల్ల వేసవి తాపం నుండి బయటపడటంతో పాటు ఇంకా ఎన్నో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube