రెండో విడత గొర్రెల పంపిణీ కోసం గొల్ల కురుమల ఆందోళన

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో రెండో విడత గొర్రెలు పంపిణీ చేపట్టాలని రోడ్డు ఎక్కి నిరసన తెలిపిన యాదవులు.యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొక్కు దేవేందర్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గంభీరావుపేట మండలం లింగన్నపేట లో 61 మంది గొల్ల కురుమలు రెండో విడత గొర్రెల కోసం డీడీలు తీసి ఆరు నెలలు గడిచింది.

 Golla Kurumala's Agitation For The Distribution Of The Second Batch Of Sheep , S-TeluguStop.com

గత ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ నిర్లక్ష్య ధోరణి వల్ల తమకు గొర్రెల పంపిణీ జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకోని న్యాయం చేయాలని, 15 రోజుల్లో తమకు గొర్రెలను పంపిణీ చేయాలని కోరారు.కాంగ్రెస్ మేనిఫెస్టోలో గొల్ల కురుమలకు రూ.2లక్షలు, గొల్ల కుర్మలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అంశం ఉన్నాయని గుర్తు చేశారు.ప్రభుత్వం స్పందించి యాదవుల సమస్యలను పట్టించుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube