రాజన్న సిరిసిల్ల జిల్లా :రెక్కడితే కానీ డొక్కా నిండని కుటుంబం వారిది.భార్య ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మధ్యహ్న భోజనం చేస్తుండగా ప్రస్తుతం చెస్ట్ వ్యాదితో బాధపడుతున్న రషీద్ వివాహాది శుభాకార్యాల్లో వంట పనులు చేసుకుంటూ ముగ్గురు ఆడపిల్ల లు కుమారుడిని పోషించుకుంటూ జీవిస్తూన్నాడు.
ముగ్గురు ఆడపిల్లల లో ఇద్దరికీ ఒక కుమారుడు కీ వివాహం జరిపించగా ఇంకో అమ్మాయి వివాహం కావాల్సి ఉంది.నిలువ నీడ లేకపోవడం తో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కే సి ఆర్ ఆత్మగౌరవ సముదాయం (డబల్ బెడ్ )రూమ్ లలో నివాసం ఉంటున్నారు.
ఇటీవల అనారోగ్యం నకు గురికాగా నంగునుర్ ప్రతిమ హాస్పిటల్ కు ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu Balaraju ) పంపించి వైద్యపరీక్షలు నిర్వహించారు.రషీద్ ను పరీక్షించిన వైద్యలు చెస్ట్ సంబందించిన వ్యాదిగా నిర్దారించారు.
ప్రస్తుతం ఆపరేషన్ చేయాలని మందులతో వ్యాది నయం కాదని యశోద ఆసుపత్రికి వెళ్లాలని రషీద్ కు అక్కడి వైద్యులు సూచించారు.చేతిలో చిల్లిగవ్వ లేక కనీసం హైదరాబాద్ వెళ్ళడానికి బస్ కిరాయి సైతం లేకపోవడంతో ఆ కుటుంబం దిక్కులు చూసుకుంటూ కూర్చుంటున్నారు.
తమ తండ్రి ఎలా ఉంటాడో అని కూతుర్లు దిగులు చెందుతున్నారు.మంత్రి కేటీఆర్ తమను ఆదుకోవాలని మానవతావాదులు దయర్థహృదయం తో ఈ ఫోన్ నెంబర్ కు 9550593399 ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.