హాత్ సే హాత్ జోడో యాత్రలో అందరు భాగస్వామ్యమవ్వాలి: మునిగెల రాజు

తంగళ్ళపల్లి: హాత్ సే హాత్ జోడో యాత్రలో తంగళ్లపల్లి మండల ప్రజలందరూ భాగస్వాములు కావాలని యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ మునిగిల రాజు ఓ ప్రకటనలో కోరారు .ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం మండల కేంద్రంలో ప్రారంభమయ్యే హాత్ సే హాత్ జోడో పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

 Everyone Should Participate In Hath Se Hath Jodo Yatra: Munigela Raju, Hath Se H-TeluguStop.com

ఈ పాదయాత్రలో కాంగ్రెస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు , రైతులు, కార్మికులు, నిరుద్యోగులు,మండల ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని అన్నారు.రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనను అంతమొందచడానికే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటున్నారని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.

వారి పక్షాన ప్రశ్నించే గొంతై పోరాడాటానికి వస్తున్న రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలకడానికి ప్రతి ఒక్క కార్యకర్త కదిలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గుగ్గిళ్ళ భరత్, ఆరేపల్లి బాలు, శ్రీనివాస్, తిరుపతి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube